ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-01-21T04:14:16+05:30 IST

ఆదివాసులు తమ సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు అన్నారు. మండల కేంద్రంలో నాలుగైదు రోజులుగా సాగుతున్న సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌(పెద్దదేవుడు) ఉత్సవాలు గురు వారంతో ముగిశాయి.

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించాలి
పెద్దదేవుడికి పూజ చేస్తున్న ఆత్రం వంశీయులు

- జైనూర్‌ ఏఎంసీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు

సిర్పూర్‌(యూ), జనవరి 20: ఆదివాసులు తమ సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు అన్నారు. మండల కేంద్రంలో నాలుగైదు రోజులుగా సాగుతున్న సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌(పెద్దదేవుడు) ఉత్సవాలు గురు వారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమా వేశంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, ఆత్రం వంశీ యుల కులగురువు ఆత్రం లింబారావు కటోడ మాట్లాడుతూ పెర్సాపేన్‌ ఉత్సవాలు నియమనిష్టలతో నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి సిర్పూర్‌కార్‌ ఆత్రం వంశీయులు, బంధు మిత్రులు అధిక సంఖ్యంలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఆత్రం శ్రీరామ్‌రాజా, ఆత్రం బల్వంత్‌రావ్‌ పటేల్‌, సర్పంచ్‌ ఆత్రం మెంగోరావు, ఆత్రం కుసుంరావు పటేల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T04:14:16+05:30 IST