సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు

ABN , First Publish Date - 2022-01-17T06:51:05+05:30 IST

మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడుతాయని భువనగిరి రూరల్‌ సీఐ జానయ్య, ఎస్‌ఐ కె. సైదులు అన్నారు. భువనగిరి మండలంలోని వడపర్తి, వడాయిగూడెం గ్రామాల్లో వేర్వేరుగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎ

సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు
భువనగిరి మండలం వడపర్తిలో బహుమతులు అందజేస్తున్న సీఐ జానయ్య

భువనగిరి రూరల్‌/ రామన్నపేట/ భూదాన్‌పోచంపల్లి, జనవరి 16: మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడుతాయని భువనగిరి రూరల్‌ సీఐ జానయ్య, ఎస్‌ఐ కె. సైదులు అన్నారు. భువనగిరి మండలంలోని వడపర్తి, వడాయిగూడెం గ్రామాల్లో వేర్వేరుగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గుండ్ల మనీష్‌గౌడ్‌, ఎంపీటీసీ ఉడుత శారద, పాండాల మైసయ్య, బొమ్మ నర్సయ్య, పాండాల రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. రామన్నపేట మండల వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. శోభనాద్రిపురంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రియదర్శిని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొవ్వూరి రంజిత, ఎర్ర నరేష్‌, ఎర్ర లింగస్వామి, బందెల మహేష్‌, కొలుకులపల్లి కిరణ్‌, మహేష్‌, వినయ్‌, చిరంజీవి, రమేష్‌ పాల్గొన్నారు. చేనేత సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని కోరుతూ భూదాన్‌పోచంపల్లిలో పలు వార్డుల్లో సందేశాత్మకంగా తమ ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి వేశారు. 

Updated Date - 2022-01-17T06:51:05+05:30 IST