ముక్కోణపు ప్రేమ... పోలీసులనాశ్రయించిన లేడీ డాన్

ABN , First Publish Date - 2020-07-06T02:52:00+05:30 IST

గ్యాంగ్‌స్టర్‌ల మధ్య ప్రేమ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. భూరి అలియాస్ అస్మితాబా గోహిల్(22) ఓ లేడీ డాన్. వరాచా ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూండేది. కొన్నాళ్ల కిందటి వరకు... సంజయ్ బాఘేలా అనే గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహితంగా మెలిగింది. అయితే కొన్నిరోజులుగా తన గ్యాంగ్ లోని రాహుల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో స్నేహంగా మెలగడం ప్రారంభించింది.

ముక్కోణపు ప్రేమ... పోలీసులనాశ్రయించిన లేడీ డాన్

సూరత్ : గ్యాంగ్‌స్టర్‌ల మధ్య ప్రేమ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. భూరి అలియాస్ అస్మితాబా గోహిల్(22)  ఓ లేడీ డాన్. వరాచా ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూండేది. కొన్నాళ్ల కిందటి వరకు... సంజయ్ బాఘేలా అనే గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహితంగా మెలిగింది. అయితే కొన్నిరోజులుగా తన గ్యాంగ్ లోని రాహుల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో స్నేహంగా మెలగడం ప్రారంభించింది.


తనను అస్మితాబా పట్టించుకోకుండా, మరో యువకుడితో చనువుగా ఉండడాన్ని భరించలేకపోయిన సంజయ్ బాఘేలా... ఆమెను చితకబాదాడు. రాహుల్ నివాసంలో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బాఘేలా... ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అంతేకాదు... ఎవరితో డేటింగ్ చేసినా ఇలాగే కొడతానంటూ బెదిరించాడు. దీంతో... ఆ లేడీ డాన్ తన కొత్త ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. మరుసటి రోజు కూడా వచ్చిన బాఘేలా మరింత బీభత్సం సృష్టించాడు. అక్కడున్న రాహుల్ బైక్ ను ధ్వంసం చేశాడు.


ఇదే క్రమంలో... అస్మితాబాపై మరోసారి చేయి చేసుకున్నాడు. అతడి దౌర్జన్యాన్ని భరించలేకపోయిన అస్మితాబా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. అయితే... పోలీసుల రాకతో పారిపోయేందుకు ప్రయత్నించిన బాఘేలా కాలు విరగ్గొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-06T02:52:00+05:30 IST