బడుగు, బలహీన వర్గాల ఇలవేల్పు గుర్రం జాషువా

ABN , First Publish Date - 2021-07-25T07:09:27+05:30 IST

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గుర్రం జాషువా ఎనలేని కృషి వారి ఇలవేల్పుగా మారాడాని తెలుగుదేశంపార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఇలవేల్పు గుర్రం జాషువా
జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు

కనిగిరి, జూలై 24: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గుర్రం జాషువా ఎనలేని కృషి వారి ఇలవేల్పుగా మారాడాని తెలుగుదేశంపార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా ఎదురుగా ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాషువా 50వ వర్దంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ సామాజక వివక్షఫై తన రచనల ద్వారా ప్రజలకు పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయుడన్నారు. డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ దోపిడీకి గురౌతున్న బలహీన వర్గాలకు అండగా నిలబడి తన రచనల ద్వారా వారిలో చైతన్యం నింపారన్నారు. నేడు ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, గుడిపాటి ఖాదర్‌,  తెలుగుయవత పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్‌, తమ్మినేని వెంకటరెడ్డి, కాసుల శ్రీరాం యాదవ్‌, టీడీపీ ముస్లీం మైనార్టీ నాయకులు షేక్‌ జంషీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు : మహాకవి గుర్రం జాషువా 50వ వర్థంతి కార్యక్రమాన్ని జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మల్లెతీగ పురస్కార గ్రహీత ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, కవులు పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘వడగాల్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం’ అన్న జాషువా జీవన కవితాసారమంతా ఈరెండు వాక్యాలలోనే ఇమిడి ఉందని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముప్పవరపు కిషోర్‌, కసుకుర్తి మాల్యాద్రి, గాండ్ల హరిప్రసాదు, పి. మాలకొండయ్య, పి.కోటయ్య, రేణ మాల అయ్యన్న, బి.సురేష్‌, షేక్‌ ఖాజావలి, బి.వెంకటేశ్వర్లు, మోహన్‌, హుస్సేన్‌, సుభాని పాల్గొన్నారు. 

దర్శి : ప్రముఖ కవి గుర్రం.జాషువా వర్ధంతిని దర్శిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సేనా నాయకులు కె.మార్కు, సంఘసేవకుడు జి.వి.రత్నం తదితరులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు ఎం.బ్రహ్మయ్య, జి.వెంకటస్వామి, కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T07:09:27+05:30 IST