Abn logo
Oct 30 2020 @ 18:53PM

సుశాంత్ హంతకులెవరు?.. ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్న ప్రశ్న!

Kaakateeya

ఇంటర్నెట్ డెస్క్: తెల్లవారితే చాలు.. సెన్సేషనల్‌ ఇష్యూస్‌ ఏంటో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ను బట్టి అంచనాకు వచ్చేస్తున్న రోజులివి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎన్ని ఉన్నా.. ట్విట్టర్‌ ట్రెండే వేరు.  ఒకరకంగా ట్రెండింగ్‌లో ట్విట్టర్‌ లీడర్‌షిప్‌ మెయింటెయిన్‌ చేస్తోంది.  మరి.. ఇవాళ ట్విట్టర్‌లో ఏమేం ట్రెండింగ్‌ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..


1. సుశాంత్ హంతకులెవరు?


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణ జరిపినా వాస్తవాలు మాత్రం బయటపెట్టడం లేదని సుశాంత్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ డైరీ ఒకటి బయటపడింది. దానిలో కొన్ని పేజీలు చింపి ఉండటాన్ని గమనించిన అభిమానులు మరోసారి గళంవిప్పారు. సుశాంత్ కేసులో తమకున్న అనుమానాలన్నింటినీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. వీటితోపాటు #WhoKilledSushant అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

2. చందమామను చూడాల్సిందే!


హిందువులు పవిత్రంగా భావించే శరత్ పౌర్ణమి కూడా శుక్రవారమే వచ్చింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ విపరీతంగా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో కూడా శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు హోరెత్తాయి. ఈరోజు  చందమామ ఆకాశంలో అత్యంత దేదీప్యమానంగా కనిపిస్తుందట. అందుకే దాదాపు ట్విట్టరాటి అంతా "शरद पूर्णिमा" టాపిక్‌ను తమ ట్వీట్లలో మెన్షన్ చేశారు. దీంతో ఈ టాపిక్ ట్విట్టర్ ట్రెండింగ్ జాబితాలో దూసుకుపోయింది.


3. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు


ముస్లింల పవిత్ర దినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రజలంతా ముస్లిం సోదరులకు ఈ పండుక శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అల్లా అందరికీ శుభం చేయాలని, ప్రపంచంలో శాంతిని పెంచాలని కోరుకుంటూ ట్విట్టరాటి ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే #EidMiladUnNabi హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ను హోరెత్తించారు. దీంతో ఇది ట్విట్టర్ ట్రెండింగ్ జాబితాలో చేరిపోయింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 75వేలకుపైగా ట్వీట్లు నమోదయ్యాయి.


4. స్టాలిన్‌ గోబ్యాక్!


తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమిళనాడులో ప్రముఖంగా చేసుకొనే ముతురామలింగ తేవర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను చూసి గోబ్యాక్.. గోబ్యాక్ అంటూ ప్రజలు నినదించారట. అయితే ఈ వార్తలను ప్రసారం చేయకుండా టీవీ ఛానెళ్లపై స్టాలిన్ ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అగ్రవర్ణాల మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎంపీ తిరుమవలవన్‌కు అండగా ఉన్నందుకే స్టాలిన్‌పై ప్రజలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మహిళలను అవమానించిన వ్యక్తికి అండగా ఉండి, స్వతంత్రం కోసం పోరాడిన తేవర్ జయంతి వేడుకల్లో ఎలా పాల్గొంటారని ట్విట్టరాటి స్టాలిన్‌ను ప్రశ్నిస్తున్నారు. #GoBackStalin అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. దీంతో ఇది ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.

5. ఈ ఫ్యామిలీకి బంపరాఫర్!


భారత్‌లో బాగా పాపులర్ అయిన యూట్యూబ్ ఛానెళ్లలో టెక్నికల్ గురూజీ కూడా ఒకటి. సాంకేతికంగా ఎటువంటి అనుమానాలొచ్చినా ఈ ఛానెల్ చూసేవాళ్లు దేశంలో కోకొల్లలు. ఈ ఛానెల్ ప్రారంభించి శుక్రవారంతో ఐదేళ్లు పూర్తయింది. దీంతో ఈ ఛానెల్ సృష్టికర్త గౌరవ్ చౌదరి అభిమానులకు ఓ బంపరాఫర్ ప్రకటించారు. పన్నెండు ఐఫోన్ 12 మొబైల్స్‌ను పంచిపెడుతున్నట్లు ఓ ప్రకటన చేశాడు. తన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన #TGFamily మెంబర్లలో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసిన 12మందికి ఈ మొబైల్స్ ఇచ్చేస్తున్నట్లు చెప్పాడు. అంతే ట్విట్టరాటి రెచ్చిపోయి మరీ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం మొదలెట్టారు. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement