జమ్మూ కశ్మీర్, ఢిల్లీ,ఉత్తరాఖండ్, నోయిడాలలో భూప్రకంపనలు

ABN , First Publish Date - 2022-02-05T16:08:32+05:30 IST

పాకిస్థాన్‌ దేశంలో శనివారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత జమ్మూ కశ్మీర్, నోయిడా,ఢిల్లీ, ఎన్సీఆర్ ఇతర ప్రాంతాల్లో భూమి ప్రకంపించింది...

జమ్మూ కశ్మీర్, ఢిల్లీ,ఉత్తరాఖండ్, నోయిడాలలో భూప్రకంపనలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ దేశంలో శనివారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత జమ్మూ కశ్మీర్, నోయిడా,ఢిల్లీ, ఎన్సీఆర్ ఇతర ప్రాంతాల్లో భూమి ప్రకంపించింది.ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ధృవీకరించింది. శనివారం ఉదయం 9.45 గంటలకు 181 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:18 గంటలకు భూకంపం సంభవించిందని యూరో-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.


యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌లోని అష్కాషమ్‌కు నైరుతి దిశలో 45 కిలోమీటర్ల దూరంలో సంభవించింది.దీంతోపాటు శనివారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.


Updated Date - 2022-02-05T16:08:32+05:30 IST