వణికించిన ఈదురుగాలులు

ABN , First Publish Date - 2021-05-12T05:15:09+05:30 IST

ఈదురుగాలులు జిల్లా ప్రజలను వణికించాయి. మంగళవారం మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలులు దుమారం రేపాయి.

వణికించిన ఈదురుగాలులు
టెక్కలి సమీపంలో ఈదురుగాలులతో ఊగుతున్న కొబ్బరిచెట్లు

ఈదురుగాలులు జిల్లా ప్రజలను వణికించాయి. మంగళవారం మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలులు దుమారం రేపాయి. దీంతో పలు మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మందస మండలంలోని బాహాడపల్లి, బేతాళపురం, తదితర గ్రామాల్లో జీడి పిక్కలు, మామిడి కాయలు నేల రాలాయి. హరిపురంలోని బెల్లుపటియా వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగుపడడంతో మంటలు చెలరేగాయి. భామిని మండలం గురండిలో వరి, మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పాలకొండ మండలంలో పలు గ్రామాల్లో అరటి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. టెక్కలి మండలం పాతనౌపడ- జెండాపేట మధ్య విద్యుత్‌ స్తంభం  నేలకొరిగింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నందిగాం, ఎల్‌ఎన్‌పేట, పాతపట్నం,  నరసన్నపేట, తదితర మండలాల్లో కూడా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కవిటి, కంచిలి, ఆమదాలవలస, ఎచ్చెర్లలలో చిరు జల్లులు కురిశాయి. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు.

-ఆంధ్రజ్యోతి బృందం





 

Updated Date - 2021-05-12T05:15:09+05:30 IST