200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కర్...రక్షించిన Indian Air Force

ABN , First Publish Date - 2022-02-21T12:19:33+05:30 IST

కర్నాటకలోని నంది కొండ వద్ద 200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కరును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించింది...

200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కర్...రక్షించిన Indian Air Force

బెంగళూరు(కర్ణాటక): కర్నాటకలోని నంది కొండ వద్ద 200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కరును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించింది.బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది హిల్ వద్ద 200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కర్‌ను భారత వైమానిక దళం, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు రక్షించాయని పోలీసు అధికారులు తెలిపారు.బెంగళూరులోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువకుడు వాగులో పడ్డారని చిక్కబళ్లాపుర పోలీసు సూపరింటెండెంట్ జికె మిథున్ కుమార్ చెప్పారు.‘‘నిశాంక్ అనే యువకుడు ట్రెక్కింగ్ కోసం ఒంటరిగా వచ్చి వాగులో పడిపోయాడు. ’’ అని కుమార్ చెప్పారు.ఆ యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ చేసి తన లొకేషన్‌ను పంచుకున్నాడు. వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్,ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో పాటు పోలీసు బృందం రక్షించడానికి వెళ్లింది.


 కానీ ఎవరూ సహాయం చేయలేకపోయారు.దీంతో తాము ఇండియన్ ఎయిర్ ఫోర్సును సంప్రదించామని, హెలికాప్టరు వచ్చి యువకుడిని  రక్షించిందని పోలీసు అధికారి తెలిపారు.200 అడుగుల దిగువన జారిపడి నంది హిల్స్‌లోని బ్రహ్మగిరి రాక్స్‌లో చిక్కుకున్న యువ ట్రెక్కర్ గురించి సేవ్ అవర్ సోల్స్ సందేశంతో చిక్కబల్లాపుర డిప్యూటీ కమీషనర్ యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను సంప్రదించినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ల్యాండింగ్ కోసం భూభాగం ప్రమాదకరంగా ఉండటంతో ఎంఐ17 యొక్క హెలికాప్టరు గన్నర్ ట్రెక్కర్‌కు దగ్గరగా ఉన్న ఒక వించ్ ద్వారా కిందికి దించారు.ప్రాణాలతో బయటపడిన యువకుడిని హెలికాప్టర్ యలహంకకు తరలించి అక్కడి నుంచి సమీప సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2022-02-21T12:19:33+05:30 IST