ఆ ప్రాంతంలో అర్ధరాత్రి హఠాత్తుగా చెట్ల నుంచి పేలుళ్లు... బయటకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-02-09T17:26:11+05:30 IST

మంచుతో కప్పబడిన టెక్సాస్‌లో ఇటీవల..

ఆ ప్రాంతంలో అర్ధరాత్రి హఠాత్తుగా చెట్ల నుంచి పేలుళ్లు... బయటకు వెళ్లి చూస్తే..

మంచుతో కప్పబడిన టెక్సాస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ అర్ధరాత్రి పేలుడు శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలు అర్థరాత్రి చెట్ల నుంచి వస్తున్నాయి. టెక్సాస్ ఫ్రీజ్ అనే మంచు తుపాను ప్రభావం చెట్లపై పేలుళ్ల రూపంలో కనిపిస్తోంది. ఈ శబ్ధం సరిగ్గా తూటాల కాల్పులు జరుగుతున్నట్లుగా వినిపిస్తోంది. ఇవి టెక్సాస్ ప్రజలకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెట్లపై పేలుళ్లు ఎక్కువగా చలి ప్రదేశాల్లో కనిపిస్తున్నాయి. 


దీనికి కారణం చెట్లలో ఉండే ప్రత్యేక రకమైన ద్రవం. దీనిని సాధారణ భాషలో సాప్ అంటారు. ఉష్ణోగ్రత కనిష్ఠానికి పడిపోయినప్పుడు, అది గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఒత్తిడి పెరుగుతూ వప్తుంది. ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒత్తిడి మరింతగా పెరిగి.. చెట్టు ధ్వంసమవుతుంది. అప్పుడు పేలుడు శబ్దాలు వస్తాయి. ఐఎఫ్ఎల్ సైన్స్ నివేదిక ప్రకారం  టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్‌లో నివసించే లారెన్ రెబెర్ మాట్లాడుతూ.. మేము రాత్రంతా కాల్పుల శబ్దాలు వింటూనే ఉన్నాం. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించాం. పొద్దున్నే నిద్ర లేవగానే తెలిసింది.. అది చలికాలం ప్రభావంతో చెట్లు పేలిన శబ్ధమని..  అన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా దేశాల్లో చోటుచేసుకున్నాయి. చలికాలంలో చెట్లు పేలిపోతున్న సంఘటనలు తలెత్తుతున్నందున ఇంట్లోనే ఉండడం మంచిదని అక్కడి అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలికాలంలో మంచు తుఫాను కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. టెక్సాస్ ప్రజలు చాలా రోజుల పాటు విద్యుత్ లేకుండా గడపవలసి వచ్చింది. తుపాను ప్రభావం రోడ్లపై స్పష్టంగా కనిపించింది. ఇక్కడ రోడ్లపై చెట్లు పడిపోయాయి. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రమాదాల నివారణకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 




Updated Date - 2022-02-09T17:26:11+05:30 IST