తాగిన మైకంలో నాటి అధికారి వింత ప్రవర్తన... చెట్టు ఎక్కడికీ పారిపోకుండా నేటికీ గొలుసులు!

ABN , First Publish Date - 2022-06-09T17:18:19+05:30 IST

భారతదేశం బ్రిటిష్ వారి అధీనంలో ఉన్నప్పుడు..

తాగిన మైకంలో నాటి అధికారి వింత ప్రవర్తన... చెట్టు ఎక్కడికీ పారిపోకుండా నేటికీ గొలుసులు!

భారతదేశం బ్రిటిష్ వారి అధీనంలో ఉన్నప్పుడు బ్రిటీష్ అధికారులు ఏకపక్షంగా, ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. విచిత్రమైన శిక్షలు విధించేవారు. వాటిని వింటే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. నాటి ఒక ఆంగ్ల అధికారి వింత ఉత్తర్వు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్ కూడా భారత్‌లో భాగమే. ప్రస్తుత పాక్‌లోని పెషావర్ నగరంలో ఇప్పటికీ గొలుసులతో బంధించిన ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. 


ఆనాటి ఆంగ్ల అధికారి ఫుల్లుగా మద్యం తాగి, ఒక చెట్టును అరెస్టు చేయమని ఆదేశించాడు. ఈ కేసు 1898 సంవత్సరం నాటిది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ చెట్టు ఇప్పటికీ గొలుసుల మధ్య బందీగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్న లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ (అప్పటి భారతదేశం)లో నియమితుడైన జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ అధికారి ఆ రోజు విపరీతంగా మద్యం తాగాడు. మద్యం మత్తులో పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఆ అధికారికి తన ముందు చెట్టు నడుస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఆ చెట్టును అరెస్టు చేయాలని మెస్‌లోని సార్జెంట్‌ను ఆదేశించారు. దీంతో అక్కడ ఉన్న సైనికులు ఆ చెట్టును గొలుసులతో కట్టారు. తరువాతి కాలంలో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. పాకిస్తాన్ నూతన దేశంగా ఏర్పడింది. అయినా ఆ చెట్టుకు ఇప్పటికీ బంధ విముక్తి లభించలేదు. ఈ చెట్టు బ్రిటిష్‌వారి అణచివేతకు గుర్తు అని అని పాకిస్తాన్‌వాసులు భావిస్తారు. ప్రస్తుతం ఈ చెట్టు పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ చెట్టుపై 'నన్ను అరెస్టు చేశారు' అని రాసి ఉన్న ప్లకార్డు కనిపిస్తుంది. 


Updated Date - 2022-06-09T17:18:19+05:30 IST