జీర్ణవ్యవస్థలో రాళ్ల సమస్యలు... ఆధునిక పరిష్కారాలు

ABN , First Publish Date - 2020-08-11T05:30:00+05:30 IST

మానవ జీర్ణవ్యవస్థలో లివర్‌, పాంక్రియాస్‌ ముఖ్యమైన అవయవాలుగా నిలుస్తాయి. లివర్‌ నుంచి బైల్‌ జ్యూస్‌, పాంక్రియాస్‌ నుంచి ఎంజైమ్‌లతో కూడిన పాంక్రియాటిక్‌ జ్యూస్‌ విడుదల అవుతుంటాయి...

జీర్ణవ్యవస్థలో రాళ్ల సమస్యలు... ఆధునిక పరిష్కారాలు

  • స్టోన్‌ ట్రీట్మెంట్‌


మానవ జీర్ణవ్యవస్థలో లివర్‌, పాంక్రియాస్‌ ముఖ్యమైన అవయవాలుగా నిలుస్తాయి. లివర్‌ నుంచి బైల్‌ జ్యూస్‌, పాంక్రియాస్‌ నుంచి ఎంజైమ్‌లతో కూడిన పాంక్రియాటిక్‌ జ్యూస్‌ విడుదల అవుతుంటాయి. ఈ రెండు జ్యూస్‌లు జీర్ణ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

లివర్‌ నుంచి విడుదల అయిన బైల్‌ జ్యూస్‌ మొదటగా బైల్‌ గొట్టాలు, గాల్‌ బ్లాడర్‌లకు చేరుకొని అక్కడ నుంచి ముందుకు సాగుతాయి.

పాంక్రియాస్‌ నుంచి విడుదల అయిన పాంక్రియాస్‌ జ్యూస్‌ మొదటగా పాంక్రియాటిక్‌ గొట్టంలో ప్రవేశించి అక్కడ నుంచి పేగుల్లోకి జారుకొంటుంది.

ఈ మార్గంలో కొన్ని సార్లు రాళ్లు పేరుకొని, ఇబ్బంది పెడుతుంటాయి.

ఈ రాళ్లు ప్రధానంగా మూడు ప్రాంతాలలో కనిపిస్తుంటాయి. 


కారణాలు.....

1. గాల్‌ బ్లాడర్‌ స్టోన్స్‌ ... ఇవి ఇన్‌ఫెక్షన్‌ వల్ల కానీ, అధిక కొలెస్టరాల్‌ వల్ల కానీ, డయాబెటీస్‌ వల్ల కానీ, హార్మోనల్‌ మార్పుల వల్ల కానీ ఏర్పడుతుంటాయి.

2. బైల్‌ డక్ట్‌ స్టోన్స్‌... పారసైటిక్‌ ఇన్‌ఫెక్షన్‌లు, పుట్టుకతోనే ఏర్పడే సిస్టులతో కానీ (ఇజిౌజ్ఛూఛీౌఛిజ్చిజూ ఛిడట్ట) ఇవి ఏర్పడుతుంటాయి.

3. పాంక్రియాటిక్‌ స్టోన్స్‌.....దీర్ఘకాలంపాటు మద్యపానం వల్ల క్రానిక్‌ పాంక్రియాటైటిస్‌ వస్తుంటుంది. దీని కారణంగా పాంక్రియాటిక్‌ డక్ట్‌లో రాళ్లు వస్తుంటాయి.

చిన్న వయస్సులో ఆహార లోపాలు, జన్యులోపాల కారణంగా ట్రాపికల్‌ పాంక్రియాటైటిస్‌ అనే ఇబ్బంది ఏర్పడి రాళ్లకు దారి తీయవచ్చు.


లక్షణాలు: 

1. గాల్‌ బ్లాడర్‌ స్టోన్స్‌ మరియు బైల్‌ డక్ట్‌ స్టోన్స్‌ .....కడుపులో కుడివైపు నొప్పి వస్తుంటుంది. అదే విధంగా నొప్పితో పాటు తీవ్రమైన చలి, జ్వరం, పచ్చ కామెర్లు ఉంటాయి.

కొన్నిసార్లు బైల్‌ డక్ట్‌లో రాళ్లు ఉన్నప్పుడు పసిరికలతో ఒళ్లు దురదలు (Pruritus) ఏర్పడవచ్చు.

2. పాంక్రియాటిక్‌ డక్ట్‌లో స్టోన్స్‌... కడుపులో పైన, మధ్య భాగంలో నొప్పి ఏర్పడి వెన్ను పూసలోకి చొచ్చుకొని పోతుంది, దీంతోపాటు డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌ల లోపం కారణంగా బరువు తగ్గడం, చమురు విరోచనం కావడం (Steatorrhea) వంటి లక్షణాలు ఉంటాయి.


నిర్ధారణ పరీక్షలు...

అలా్ట్ర సౌండ్‌ పరీక్షల ద్వారా చాలాసార్లు స్టోన్స్‌ను పసిగట్టవచ్చు. LFT వంటి రక్త పరీక్షలు, సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ల ద్వారా రోగ నిర్ధారణ, వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు. రోగ నిర్ధారణ కోసం ఉపయోగించే ముఖ్యమైన పరీక్షగా ఎండోస్కోపిక్‌ అలా్ట్రసౌండ్‌ (EUS)ను చెప్పవచ్చు. దీని ద్వారా రేడియేషన్‌, సైడ్‌ ఎఫెక్టులు లేకుండా సునిశితంగా రోగ నిర్ధారణ చేయవచ్చు. ఈ అత్యాధునిక పరికరం కొన్ని నిర్దిష్టమైన సెంటర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


చికిత్స:

జీర్ణవ్యవస్థలో రాళ్లు సమస్యకు మందులతో నొప్పి తీవ్రతను తాత్కాలికంగా తగ్గించేందుకు వీలవుతుంది. అయితే శాశ్వత పరిష్కారం కోసం ఇంటర్‌వెన్షన్‌లు  అవసరం అవుతాయి. బైల్‌ గొట్టాలు, పాంక్రియాటిక్‌ గొట్టాలలో సమస్య ఉన్నట్లయితే....ప్రత్యేక ఎండోస్కోపి విధానాలు అయినటువంటి లిథోట్రిప్సీ, ఈఆర్‌సీపీ, స్టెంట్‌ పద్ధతుల ద్వారా రాళ్లను తొలగించవచ్చు. ఒకవేళ ఎండోస్కోపి పద్ధతులతో పరిష్కారం కాకపోతే, ఆపరేషన్‌ విధానాలు అయిన హెపటికో జెజునెస్టమీ, ఎల్‌.పీ.జే ఆపరేషన్‌ విధానాల ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. వీటిలో కొన్ని లాపరోస్కోపిక్‌ పద్ధతులతో కూడా చేయవచ్చు.

గాల్‌ బ్లాడర్‌లో ఏర్పడే రాళ్లను లాపరోస్కోపిక్‌ విధానం ద్వారా ఆపరేట్‌ చేసి లాపరోస్కోపిక్‌ కొలిసిస్టెక్టమీ ద్వారా పూర్తిగా పరిష్కరించవచ్చు.


రెనోవా NIGL లో ఎండోస్కోపిక్‌ అలా్ట్ర సౌండ్‌ వంటి అత్యాధునిక వైద్య నిర్ధారణ పరికరాలతో పాటుగా అడ్వాన్సుడు లాపరోస్కోపిక్‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా నిష్ణాతులైన మెడికల్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ టీమ్‌ల ద్వారా లివర్‌, పాంక్రియాస్‌ సమస్యలకు అత్యాధునిక ట్రీట్‌మెంట్‌ అందుబాటులో ఉంటుంది.



డాక్టర్‌ ఆర్‌.వి.రాఘవేంద్రరావు, M.S., M.Ch., (SGPGI), F.H.P.B., F.L.T., (SNUH)


సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

డైరెక్టర్‌ రెనోవా NIGL హాస్పిటల్‌,

న్యూ ఎమ్‌ ఎల్‌ ఎ కాలనీ, రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

ఫోన్‌: 79930 89995, ఇ-మెయిల్‌: drrvrrao@gmail.com

Updated Date - 2020-08-11T05:30:00+05:30 IST