డిప్యూటీ డైరెక్టర్ గంగాద్రి
చిత్తూరు కలెక్టరేట్, జూలై 1: ఉమ్మడి చిత్తూరు జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డి.గంగాద్రిని ప్రభుత్వం నెల్లూరు జిల్లా డీడీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా డీడీగా పనిచేస్తున్న ఎం. రామచంద్రను ఇక్కడికి బదిలీ చేసింది. 2017 మే 25 నుంచి గంగాద్రి చిత్తూరు జిల్లా డీడీగా ఐదేళ్లకు మించి పనిచేశారు. సోమవారం ఆయన చిత్తూరు నుంచి రిలీవ్ కానున్నారు.