Traveling to the mountains: వర్షాకాలంలో పర్వతాలకు ప్రయాణిస్తున్నారా? మీకోసం కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు..

ABN , First Publish Date - 2022-08-18T20:10:08+05:30 IST

భారతదేశంలో సులభంగా ఎక్కగలిగే పర్వతాలనుంచి ఎక్కెందుకు కాస్త కఠినంగా ఉండే వాటి వరకు, అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతో వెలసిల్లే అన్ని రకాల సుందర ట్రెక్కింగ్ గమ్యాలకు ఆలవాలం.

Traveling to the mountains: వర్షాకాలంలో పర్వతాలకు ప్రయాణిస్తున్నారా? మీకోసం కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు..

వర్షాకాలం ప్రయాణమంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందే...పర్వతారోహణకు వెళ్లితే భద్రత ఎప్పుడూ అవసరమే..వర్షాలు ఆనందాన్నిస్తాయి.. ఈ సీజన్ లో ప్రయాణం పెట్టుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సాహస ప్రేమికులు అది ఏ సీజన్ అయినా పర్వతారోహణకు ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు.


భారతదేశంలో సులభంగా ఎక్కగలిగే పర్వతాల నుంచి ఎక్కెందుకు కాస్త కఠినంగా ఉండే వాటి వరకు, అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతో వెలసిల్లే ట్రెక్కింగ్ గమ్యాలకు ఆలవాలం. మరి ఈ సమయంలో వీటికి వెళ్ళాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందే..వాటర్ ఫ్రూఫ్ లగేజీతో పాటు అవసరమైన వస్తువులను తీసుకువెళ్ళడం మంచిది.. ఇంకా మరిన్ని చిట్కాలు జాగ్రత్తలు తప్పనిసరి.


1. సింథటిక్ దుస్తులను తీసుకెళ్లండి..

ముఖ్యంగా వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవలసిన ముఖ్యమైన విషయం దుస్తులు.. ఇవి సింథటిక్ దుస్తులయితే తేలికగా ఉంటాయి. తేమగా ఉన్నా తరవాత ఆరిపోతాయి. చాలాసార్లు దుస్తులు మార్చుకోవల్సిన అవసరం ఉండదు. 


2. దోమలు, కీటకాల నుంచి... 

ఈగలు కీటకాల నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలి. అక్కడ ఏదోటి చూసుకుందాంలే అనే నిర్లష్యం కాకుండా ట్రిప్ ను ప్లాన్ చేస్తున్నప్పుడే దోమల నుంచి కాపాడే రోల్ ఆన్ లు, స్టిక్ ఆన్ అను తీసుకెళ్లాలి. ఎందుకంటే వర్షాకాలంలో దోమ కాటుతో అనారోగ్యం పాలు కావడం ఎక్కువగా ఉంటుంది. 


3. రెయిన్ కోట్ లు, గొడుగులు పట్టుకెళ్ళండి..

వర్షాకాలంలో యాత్ర మొదలు పెట్టామంటే వర్షం ఎప్పుడు వచ్చి పడుతుందో ఎవరం చెప్పలేం. రిస్క్ చేయడం కన్నా ఈ సీజన్ లో వచ్చే వర్షాలను తట్టుకునేట్టు గొడుగులు, రెయిన్ కోట్లు తప్పని సరి.


4. ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్ళండి.

ఫోన్ లేదా టాబ్లెట్ వర్షంలో తడిసిపోయే అవకాశం ఉంటుంది. వాటిని గాలి చొరబడని కవర్‌లలో ఉంచడం ఉత్తమం. ఎలాంటి నష్టం జరగకుండా కవర్‌ను సరిగ్గా సీల్ చేసేట్టు చూసుకోండి.


5. వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలి.

భారీ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ పరిస్థితులను సరిచూసుకోండి. దాని ప్రకారంగా ఎండ రోజులా కనిపించినప్పటికీ, కొన్నిసార్లు తుఫాను రావడానికి అరగంటే సమయం పడుతుంది.


6. నదుల్లోకి దూకొద్దు..

అగస్మాత్తుగా వచ్చిపడే వరదల గురించి ఎప్పుడైనా విన్నారా? ఆకస్మిక వరద అనేది ఎగువ ప్రాంతాలలో అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో అకస్మాత్తుగా, వేగవంతమైన నీటి ప్రవాహం ఉంటుంది. నది చూడడానికి ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ ఆకస్మిక వరద సంభవించినప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.  


రుతుపవనాలు మారి ఈ సంవత్సరం అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడటం వలన చాలా హిల్ స్టేషన్స్ లను చేరుకోలేని పరిస్థితి. ఏదీ ఏమైనా వర్షాకాలంలో పర్వత యాత్రకు అన్నీ సవాళ్ళే ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని మరీ పర్వతాలను ఎక్కి ఆనందించాలనే బహు కొద్ది మందికి రాబోయే నెలల్లో సురక్షితమైన యాత్ర చేసేలా చిట్కాలు, జాగ్రత్తలు ఇవి.

Updated Date - 2022-08-18T20:10:08+05:30 IST