ఆ మందులు ఇక్కడ తీసుకోండి

ABN , First Publish Date - 2020-03-31T10:54:36+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులపై పడింది. వైద్య నిపుణులు సూచించిన మేరకు నిర్ధేశిత

ఆ మందులు ఇక్కడ తీసుకోండి

లాక్‌డౌన్‌తో  స్తంభించిన రవాణా వ్యవస్థ 

హెచ్‌ఐవీ మందులకు ఏలూరు రాలేకపోతున్న రోగులు 

లింక్‌ ఏఆర్‌టీ సెంటర్లలో తీసుకునే వెసులుబాటు 


ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 30 : కరోనా వైరస్‌ ప్రభావం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులపై పడింది. వైద్య నిపుణులు సూచించిన మేరకు నిర్ధేశిత మందులను ఒక్క రోజైనా తీసుకోకపోతే రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న ఏఆర్‌టీ (యాంటీ రిట్రో వైరల్‌థెరిపీ) కేంద్రానికి నిత్యం వందలాది మంది మందులకు కోసం వస్తుం టారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మందులు తీసుకునే నిబంధనలను సడలించి వెసు లుబాటు కల్పించారు. ఇకపై వీరు తమకు దగ్గరలోవున్న కేంద్రాల్లో వీటిని తీసు కోవచ్చు.


ఏలూరు ఏఆర్‌టీ కేంద్రం పరిధిలో 19,590 మంది ఎయిడ్స్‌ రోగులు ఉన్నారు. వీరిలో 7,167 మంది ఏఆర్‌టీ మందులను వినియోగిస్తున్నారు. జాతీ య ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (నాకో), ఏపీ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (ఏపీ సాక్స్‌) ఎయిడ్స్‌ రోగులకు ఏఆర్‌టీ మం దులను ఉచితంగా పంపిణీ చేస్తుంటాయి. గుర్తించిన ప్రతీ రోగికి నెల నుంచి మూడు నెల లకు సరిపడా మందులను అందిస్తారు. ఆ మేరకు తదుపరి కోటా మందులు తీసుకునేం దుకు రావాల్సిన గడువు తేదీని ముందుగానే రోగులకు నిర్ధారించి పంపిస్తారు. నిర్ధేశిత గడు వు తేదీ నాటికి సంబంధిత రోగులు ఏఆర్‌టీ కేంద్రానికి కచ్చితంగా వచ్చి మందులు తీసుకో వాలి. అలా మందులు తీసుకుని వైద్యుల సిఫా ర్సుల మేరకు వినియోగించకపోతే 24 గంటల తర్వాత నుంచే రోగిలో అనారోగ్య పరిస్థితులు క్రమేణా ఎక్కువ అవుతుంటాయి. ఈ కేంద్రానికి మెట్ట ప్రాంత మండలాలతోపాటు సరిహద్దు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల నుంచి తెలంగాణలోని ఖమ్మం, అశ్వారరావుపేట, తదితర ప్రాంతాల నుంచి ఎయిడ్స్‌ రోగులు ఏఆర్‌టీ మందుల నిమిత్తం వస్తుంటారు.


లాక్‌డౌన్‌ కారణంగా వీరిలో ఏలూరు, పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు ఉన్న కొందరు మినహా దాదాపు 80 శాతం మంది ఏఆర్‌టీ మందులకు దూరమయ్యారు. ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఏఆర్‌టీ కేంద్రాల పరిధిలో ఎయిడ్స్‌ రోగుల అందరిపైనా లాక్‌డౌన్‌ ప్రభావం ఉంది. ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపి వేయడంతో వేల సంఖ్యలో రోగులు ఏఆర్‌టీ మందులు తీసుకునేందుకు వీలు లేకపోయింది. ఇప్పట్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలుగాని, ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశాలుగాని లేకపోవడంతో ఎయిడ్స్‌ రోగులు మందులు తీసుకునేందుకు నిబంధనలను సడలించి వెసులుబాటు కల్పించారు. ఆ ప్రకారం ఏలూరు ఏఆర్‌టీ కేంద్రం పరిధిలో పని చేస్తున్న చింతలపూడి, జంగారెడ్డిగూడెం, భీమ డోలులోని లింక్‌ ఏఆర్‌టీ సెంటర్‌లలో మందులు తీసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. ఎక్కడికక్కడ రోగులు తమకు అందుబాటులోవున్నా సంబంధిత లింక్‌ ఏఆర్‌టీ సెంటర్‌లకు వెళ్లి మందులు తీసుకోవచ్చు. భీమవరం ఏఆర్‌టీ కేంద్రం పరిధిలో వున్న పాలకొల్లు, ఆకివీడు, నరసాపురం లింక్‌ ఏఆర్‌టీ సెంటర్లు, తాడేపల్లిగూడెం ఏఆర్‌టీ సెంటర్‌ పరిధిలో వున్న కొయ్యలగూడెం, నిడదవోలు లింక్‌ ఏఆర్‌టీ సెంటర్‌లకు వర్తింపజేశారు.


Updated Date - 2020-03-31T10:54:36+05:30 IST