పుదువైలో రవాణా కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2022-03-15T15:39:12+05:30 IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులు.. వివిధ డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు ఆందోళనతో పాటు సమ్మెకు దిగారు. ఈ కార్మికులకు గత రెండేళ్లుగా దీపావళి బోనస్‌ ఇవ్వ

పుదువైలో రవాణా కార్మికుల సమ్మె

పుదుచ్చేరి(చెన్నై): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులు.. వివిధ డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు ఆందోళనతో పాటు సమ్మెకు దిగారు. ఈ కార్మికులకు గత రెండేళ్లుగా దీపావళి బోనస్‌ ఇవ్వ లేదని తేలింది. దీని కోసం ప్రభుత్వ రవాణా కార్మిక సంఘాలు పలు రకాలుగా పోరాటాలు జరిపాయి. అయితే దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం విధులను బహిష్కరించిన కార్మికులు.. సమ్మెకు దిగారు. దీంతో పుదుచ్చేరి, కారైక్కాల్‌ జిల్లాల నుంచి ఇరుగు పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సిన 150కి పైగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నిలిచిపోయాయి. డిపోల ముందు బైఠాయించి నిరసనతెలిపిన కార్మికులు.. తమకు బకాయి ఉన్నన బోనస్‌ వెంటనే చెల్లించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా వుండగా పుదుచ్చేరి నుంచి తమిళనాడుకు సర్వీసులు యధాతథంగా నడిచినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-03-15T15:39:12+05:30 IST