Abn logo
May 22 2020 @ 05:08AM

పారదర్శకంగా రవాణాశాఖ సేవలు

ఒంగోలు(క్రైం), మే 21: రవాణాశాఖ ద్వారా అన్ని రకాల సేవలను ప్రజల కు పారదర్శకంగా  అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రవాణాశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ శ్రీకృష్ణవేణి తెలిపారు. గురువారం ఒంగోలులోని డీటీ సీ కార్వాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లా డుతూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న 83 సేవలతో పాటు ఎల్‌ఎల్‌ఆర్‌ డ్రైవి ంగ్‌ లైసెన్సులకు సంభందించి స్లాటులను అందుబాటులో ఉంచామన్నారు.  కరోనా వైరస్‌ కారణంగా 33శాతం మాత్రమే స్లాటులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.


రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే వారు కచ్చితంగా మాస్కు లు ధరించి రావాలని, కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద థర్మల్‌స్కానింగ్‌ చే స్తామని వెల్లడించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు రక్షణ కిట్లు ఉచితంగా పంపిణి చేస్తున్నామని, ఇప్పటికి 4 వేల కిట్లు అందజేసినట్లు చెప్పారు. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు కచ్చితంగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించా లని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్టీవో చంద్రశేఖరరెడ్డి, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ జ యప్రకాష్‌, ఏవో కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement