ట్రాన్స్‌పరెంట్‌ టీవీలు

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

ఏటా సరికొత్త టీవీలు మార్కెట్‌ను కమ్మేస్తున్న విషయం తెలిసిందే. సైజ్‌ నుంచి స్లిమ్‌ వరకు దేనికదే కొత్తగా కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా కొత్త టీవీలు మార్కెట్లో హల్‌చల్‌ చేసే సూచనలే మెండుగా ఉన్నాయి...

ట్రాన్స్‌పరెంట్‌ టీవీలు

ఏటా సరికొత్త టీవీలు మార్కెట్‌ను కమ్మేస్తున్న విషయం తెలిసిందే. సైజ్‌ నుంచి స్లిమ్‌ వరకు దేనికదే కొత్తగా కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా కొత్త టీవీలు మార్కెట్లో హల్‌చల్‌ చేసే సూచనలే మెండుగా ఉన్నాయి. సీత్రూ గ్లాస్‌లా కనిపించే టీవీలు రాబోతున్నాయి. సోఫాలోనో, బెడ్‌లోనో ఇమిడిపోయి ఉండి, బటన్‌ నొక్కగానే పైకి వస్తాయి. బటన్‌ ఆఫ్‌ చేయగానే సాదారణ గ్లాస్‌లా మారిపోయి లోపలికి వెళతాయి. ఆల్‌ డిజిటల్‌ కన్జుమర్‌ టెక్‌ కాన్ఫరెన్స్‌లో ఎల్‌జి ఈ తరహా టీవీని ప్రదర్శించింది. 


వాస్తవానికి ట్రాన్స్‌పరెంట్‌ టీవీలు మొత్తంగా కొత్తవేం కాదు. ఇప్పుడు ఉన్నంత స్మార్ట్‌గా కాకున్నా 55 ఇంచీల ట్రాన్స్‌రెంట్‌ టీవీలను ‘షావోమీ’ గత ఆగస్టులోనే మార్కెట్‌లో ప్రదర్శించింది. దీని ధరకూడా ఏడు వేల రెండు వందల డాలర్లుగా నిర్ణయించింది. 

నిజానికి వీటి అవసరం పెద్దగా లేనప్పటికీ త్వరలోనే ట్రాన్స్‌పరెంట్‌ టీవీలు మార్కెట్‌ను ముంచెత్తే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే షాపింగ్‌ మాల్స్‌, ఆర్ట్‌ మ్యూజియమ్స్‌, హై-ఎండ్‌ రెస్టారెంట్ల వంటి వాటి దగ్గర వీటిని పెడితే ఉపయోగం ఉందని చెబుతున్నారు. అవసరమైనప్పుడు ఇది టీవీలా, తరవాత ఒక పార్టిషన్‌ గ్లాస్‌లా ఉపయోగపడుతుందని  చెబుతున్నారు. అనతి కాలంలోనే ఇళ్లలో ప్రవేశిస్తాయని భావిస్తున్నారు. టీవీని ఇంతవరకు లివింగ్‌ రూమ్‌లో గోడకు ఫిక్స్‌ చేస్తున్నారు. ఇకపై పార్టిషన్‌ అంటే ఒకే గదిలో ఉన్న  ప్రదేశాన్ని అనువైన పద్ధతిలో విభజించేందుకూ ఈ టీవీ ఉపయోగపడనుంది. ధర, నాణ్యత వినియోగదారుడికి నచ్చితే లివింగ్‌ రూమ్‌ల్లో ట్రాన్స్‌పరెంట్‌ టీవీ సందడి చేస్తుందన్న అభిప్రాయాలు మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST