నవమాసాలు మోసి బిడ్డను కన్నా..ఈ మాత్రానికే నేను ‘అమ్మ’నైపోతానా..? ఓ తండ్రి ప్రశ్న

ABN , First Publish Date - 2021-12-24T02:50:02+05:30 IST

ఓ వ్యక్తి ఆడామగా అనేది తనే నిర్ణయించుకోవాలి.. అది ఆ వ్యక్తికి పుట్టుకతో వచ్చిన హక్కు! అమెరికాకు చెందిన బెన్నెట్ కాన్సపర్(37) ఇటీవలే ఓ పడండి బిడ్డకు జన్మనిచ్చాడు.

నవమాసాలు మోసి బిడ్డను కన్నా..ఈ మాత్రానికే నేను ‘అమ్మ’నైపోతానా..? ఓ తండ్రి ప్రశ్న

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తికి తాను ఆడా, మగా లేదా మరొకటా అనేది నిర్ణయించుకునే హక్కు ఉంది.  అది ఆ వ్యక్తికి పుట్టుకతో వచ్చిన హక్కు! ఈ విషయంలో సమాజం చెప్పే నిర్వచనాలేవీ ఆ వ్యక్తికి వర్తించజాలవు.. లాస్ ఏంజిలిస్‌కు(అమెరికాకు) చెందిన బెన్నెట్ కాస్పర్ (37) ఇదే చెబుతున్నాడు. అతడు గత అక్టోబర్‌లో ఓ పడంటి బిడ్డకు జన్మనిచ్చాడు. తన గర్భంలో బిడ్డను తొమ్మిది నెలల పాటు మోసి కన్నాడు. బిడ్డను చూసి అతడి భర్త కూడా మురిసిపోయాడు. కానీ..ఆస్పత్రిలోని నర్సుల తీరుతోనే కాస్పర్ విసిగిపోయాడు. తనను మాటమాటికీ ‘అమ్మ’ అని వారు సంబోధిస్తుండటం పట్ల అతడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అప్పటి అనుభవాలను ఇటీవలే స్థానిక మీడియాతో పంచుకున్నాడు. 


‘‘గర్భసంచితో పుట్టినంత(మహిళగా) మాత్రన పిల్లలు పుడతారన్న గ్యారెంటీ ఏమీ లేదు. మాతృత్వం, స్త్రీత్వం ఒకటే అనడం సబబు కాదు. మహిళలందరూ పిల్లల్ని కనలేరు. తల్లులందరూ తమ పిల్లల్ని నవమాసాలూ మోసి కనలేదు. పిల్లల్ని కడుపులో మోసిన వారందరూ తల్లులు కారు..’’ అని తేల్చి చెప్పాడు. పుట్టుకతో మహిళ అయిన బెన్నెట్ 2011లో తాను ట్రాన్స్‌జెండర్ అన్న నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో అతడు శస్త్రచికిత్స ద్వారా తన వక్షోజాలను తొలగించుకున్నాడు. హార్మోన్ చికిత్స ద్వారా కొన్ని పురుష లక్షణాలను సంతరించుకున్నాడు. అయితే.. పుట్టుకతో వచ్చిన గర్భాశయాన్ని మాత్రం అతడు తొలగించుకోలేదు. దాని వల్ల తనకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదని అతడు చెప్పాడు. 2019లో అతడికి వివాహమైంది. సహజ పద్ధతుల్లోనే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చాడు.   

Updated Date - 2021-12-24T02:50:02+05:30 IST