బదిలీలు, విద్యుత్‌ బిల్లులకు ముడిపెట్టారు

ABN , First Publish Date - 2022-06-30T06:12:30+05:30 IST

జిల్లా ట్రాన్స్‌కోలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలకు ఈనెల విద్యుత్‌ బిల్లుల వసూ ళ్లకు ముడిపెట్టారు. వాస్తవానికి జిల్లాలోని సుమారు 230మం ది సిబ్బంది ఉండగా, అందులో జేఏవోలు, సబ్‌ ఇంజనీర్లు, సీనియర్‌, జూనియర్‌ రికార్డు అసిస్టెంట్లు, జేఎల్‌ఎం, లైన్‌మన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఆర్డినేట్‌ల బదిలీల ప్రక్రియ బుధవారంతో ముగియాల్సి ఉంది.

బదిలీలు, విద్యుత్‌ బిల్లులకు ముడిపెట్టారు

భువనగిరి టౌన్‌, జూన్‌ 29: జిల్లా ట్రాన్స్‌కోలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలకు ఈనెల విద్యుత్‌ బిల్లుల వసూ ళ్లకు ముడిపెట్టారు. వాస్తవానికి జిల్లాలోని సుమారు 230మం ది సిబ్బంది ఉండగా, అందులో జేఏవోలు, సబ్‌ ఇంజనీర్లు, సీనియర్‌, జూనియర్‌ రికార్డు అసిస్టెంట్లు, జేఎల్‌ఎం, లైన్‌మన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఆర్డినేట్‌ల బదిలీల ప్రక్రియ బుధవారంతో ముగియాల్సి ఉంది. కానీ ఈ నెల విద్యుత్‌ బిల్లుల వసూళ్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఉద్యోగుల బదిలీల అంశాన్ని వారం రోజులపాటు అనధికారికంగా వాయిదా వేసిన ట్లు తెలుస్తోంది. ఈనెల 13న ప్రారంభమైన బదిలీల ప్రక్రియలో భాగంగా 28న బదిలీ ఉత్తర్వులు వెలువడితే బదిలీ అయిన ఉద్యోగులు 30లోపు విధుల్లో చేరాల్సి ఉంది. కానీ బదిలీ ఉత్తర్వులు,విధుల్లో చేరడం తదితరాలు జులై మొదటి వారం లో ముగియనున్నట్లు అధికారులతోపాటు యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు. అయితే బిల్లుల వసూళ్లు తమ బాధ్యతే  అయినప్పటికీ వసూళ్లవంకతో పలు ఒత్తిళ్ల కారణంగా ఉద్యోగుల బదిలీల్లో కొంతమంది కి మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది ఉద్యోగులు వాపోతున్నారు. అనుకూలమైన పోస్టింగ్‌లకోసం కొంతమంది ఉద్యోగులు సంబంధిత అధికారులపై ఇప్పటికీ పలు రకాల ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఏదేమైనా షెడ్యూల్‌ ప్రకారం బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-30T06:12:30+05:30 IST