రెవెన్యూలో కుదుపు

ABN , First Publish Date - 2022-07-02T06:40:22+05:30 IST

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు.

రెవెన్యూలో కుదుపు

ఉమ్మడి జిల్లాలో భారీగా బదిలీలు

అన్ని కేడర్లు కలిపి 486 మందికి స్థానచలనం

జాబితాలో 45 మంది తహసీల్దార్లు, 93 మంది డీటీలు, 157 మంది వీఆర్వోలు, 132 మంది సీనియర్‌ అసిస్టెంట్లు

అధికార పార్టీ నేతల సిఫారసులకు పెద్దపీట


విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):


ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. తహసీల్దార్ల నుంచి ఆఫీస్‌ సబార్డినేట్‌ వరకు మొత్తం 486 మందికి స్థానచలనం కలిగించారు. వీరిలో 45 మంది తహసీల్దార్లు ఉన్నారు. మొత్తమ్మీద చూస్తే అధికార పార్టీ నేతల సిఫారసులకు ఉన్నతాధికారులు పెద్దపీట వేశారు. సొంతంగా నిర్ణయం తీసుకునే దిశగా యత్నించిన నేపథ్యంలో సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అప్పటివరకు రూపొందించిన జాబితాల్లో మార్పులు చేశారనే ప్రచారం జరుగుతోంది. దాంతో గురువారం రాత్రి విడుదల కావలసిన బదిలీ ఉత్తర్వులు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. 

జిల్లాలో కీలక మండలాలకు తహసీల్దార్‌ల పోస్టింగ్‌ విషయంలో నేతలు చెప్పినట్టే ఉన్నతాధికారులు నడుచుకున్నారనే వాదన వినిపిస్తోంది. తహసీల్దార్‌, కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల ఏవో పోస్టుల నియామకాల్లో నేతల సిఫారసులకు ప్రాధాన్యం లభించిందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో సీసీఎల్‌ఏ, రెవెన్యూ సంఘం సిఫారసులతోపాటు విధి నిర్వహణలో దూకుడుగా ఉండడం, సమర్థంగా పనిచేస్తున్న వారిని ప్రాధాన్యం కలిగిన స్థానాల్లో తీసుకున్నారు. విశాఖ, అనకాపల్లి కలెక్టరేట్‌లలో భూముల సెక్షన్‌ (గతంలో సీ సెక్షన్‌) సూపరింటెండెంట్లగా పైల రామారావు, సీహెచ్‌ చంద్రశేఖర్‌లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. మరికొంతమందికి అప్రాధాన్య మండలాలకు తహసీల్దార్లుగా పోస్టింగ్‌ ఇచ్చారు. రెండు రోజుల క్రితం అచ్యుతాపురంలో వీఆర్వో లంచం తీసుకుంటూ దొరికిన నేపథ్యంలో అక్కడ పనిచేసే తహసీల్దారు రాంబాయిని అనంతగిరి బదిలీ చేశారు. ఆరోపణల కారణంగా సబ్బవరం తహసీల్దార్‌ రమాదేవిని ప్రాధాన్యం లేని పెదగంట్యాడకు బదిలీ చేశారు. కాగా కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున పలు పర్యాయాలు చర్చించిన అనంతరం బదిలీల జాబితాలకు తుది రూపం ఇచ్చారు. కాగా తహసీల్దార్ల తరువాత ప్రాధాన్యం కలిగిన డిప్యూటీ తహసీల్దార్లను చూస్తే 93 మందిని బదిలీ చేశారు. ఇంకా 132 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 29 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 12 మంది టైపిస్టులు, 63 మంది ఆఫీస్‌ సబార్డినేట్‌లను బదిలీ చేశారు. 

భారీగా తహసీల్దార్ల బదిలీ

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తహసీల్దార్‌లకు భారీగా బదిలీలు అయ్యాయి. మొత్తం 54 మంది తహసీల్దార్లకుగాను 45 మందికి స్థానచలనం కలగగా, తొమ్మిది మందిని మాత్రం యథాస్థానాల్లో కొనసాగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. భీమిలి తహసీల్దార్‌గా పనిచేస్తున్న కేవీ ఈశ్వరరావును విశాఖపట్నం కలెక్టరేట్‌ పాలనాధికారి (అడ్మిన్‌ సూపరింటెండెంట్‌)గా నియమించారు. ఆనందపురం తహసీల్దార్‌ కేవీ వేణుగోపాల్‌ను భీమిలి తహసీల్దార్‌గా, అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న పి.శ్యామ్‌ప్రసాద్‌ను నగరంలోని సీతమ్మధార తహసీల్దార్‌గా, కలెక్టరేట్‌ ఏవో ఆనంద్‌కుమార్‌ను పెందుర్తి తహసీల్దార్‌గా బదిలీచేశారు. 

విశాఖ ఆర్డీవో కార్యాలయం పాలనాధికారి ఎస్‌.రమణయ్యను పాడేరు సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ ఏవోగా నియమించారు. గాజువాక తహసీల్దార్‌ ఎన్‌వీఎస్‌ లోకేశ్వరరావును పద్మనాభం, గోపాలపట్నం తహసీల్దార్‌ను అనకాపల్లి ఆర్డీవో కార్యాలయ ఏవోగా, మహరాణిపేట తహసీల్దార్‌ పాల్‌కిరణ్‌ను విశాఖ రూరల్‌కు, ములగాడ తహసీల్దార్‌ ఎన్‌.రమామణిని మహరాణిపేట తహసీల్దార్‌గా బదిలీ చేసి ఆమె స్థానంలో సీతమ్మధార తహసీల్దార్‌ కె.జ్ఞానవేణిని నియమించారు. అలాగే పద్మనాభం తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావును వీఎంఆర్‌డీఏలో స్పెషల్‌ తహసీల్దార్‌గా, పెదగంట్యాడ తహసీల్దార్‌ కేవీ రామలక్ష్మిని కలెక్టరేట్‌లో మెజిస్టీరియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా, పెందుర్తి తహసీల్దార్‌ ఎన్‌.బాబ్జీని మునగపాక, విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ ఎల్‌.రామారావును ఆనందపురం, విశాఖ ఆర్డీవో ఆఫీస్‌లో స్పెషల్‌ తహసీల్దార్‌ ఎం.సుమబాలను కలెక్టరేట్‌లో కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా, వీఎంఆర్‌డీఏలో పనిచేస్తున్న ఐ.తారకేశ్వరిని విశాఖ ఆర్డీవో ఆఫీస్‌లో స్పెషల్‌ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో భూ రికార్డులు విభాగంలో పనిచేస్తున్న ఎంఏ మనోరంజనిని విశాఖ ఆర్డీవో ఆఫీస్‌ ఏవోగా, ఎంవీకేఎస్‌ రవిని ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ స్పెషల్‌ తహసీల్దార్‌గా, ఎంఎస్‌ కళావతిని ల్యాండ్‌ రిఫార్మ్స్‌ ఏవోగా, మెజిస్టీరియల్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న సుజాతను గాజువాక తహసీల్దార్‌గా, నర్సీపట్నం తహసీల్దార్‌ కె.జయను గోపాలపట్నం, అచ్యుతాపురం తహసీల్దార్‌ జి.రాంబాయిను అనంతగిరి, అనకాపల్లి ఆర్డీవో ఆఫీస్‌ ఏవో డి.సుబ్రహ్మణ్యశాస్ర్తిని నక్కపల్లి తహసీల్దార్‌గా, ఎలమంచిలి తహసీల్దార్‌ వై.శ్రీనివాసరావును అచ్యుతాపురం, మునగపాక తహసీల్దార్‌ కె.జయప్రకాష్‌ను పాయకరావుపేట, పరవాడ తహసీల్దార్‌ బీవీ రాణిని చీడికాడకు, సబ్బవరం తహసీల్దార్‌ కె.రమాదేవిని పెదగంట్యాడకు, బుచ్చెయ్యపేట తహసీల్దార్‌ ఎస్‌ఏ మహేశ్వరరావును రావికమతం బదిలీ చేశారు. రావికమతం తహసీల్దార్‌ పి.కనకరావును నాతవరం, రోలుగుంట తహసీల్దార్‌ శ్రీనివాసరావును ఎస్‌.రాయవరానికి, దేవరాపల్లి తహసీల్దార్‌ జె.రమేష్‌బాబును కె.కోటపాడుకు బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న కె.లక్ష్మిని దేవరాపల్లికి, చీడికాడ తహసీల్దార్‌ అంబేడ్కర్‌ను బుచ్చెయ్యపేటకు, నర్సీపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో ఆర్‌.నర్సింహమూర్తిని అనకాపల్లి కలెక్టరేట్‌ కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌కు, గొలుగొండ తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావును రోలుగుంట, మాకవరపాలెం తహసీల్దార్‌ ఎస్‌.రాణి అమ్మాజిని ఎలమంచిలి, నాతవరం తహసీల్దార్‌ కె.జానకమ్మను పాడేరు తహసీల్దార్‌, పాయకరావుపేట తహసీల్దార్‌ పి.అంబేడ్కర్‌ను గొలుగొండ, ఎస్‌.రాయవరం తహసీల్దార్‌ బి.సత్యనారాయణను సబ్బవరం, నక్కపల్లి తహసీల్దార్‌ బీవీ రమణను నర్సీపట్నం, అనంతగిరి తహసీల్దార్‌ ఎంవీవీ ప్రసాద్‌ను మాకవరపాలెం, పాడేరు తహసీల్దార్‌ వి.ప్రకాష్‌రావును పరవాడ తహసీల్దార్‌గా, అనకాపల్లి కలెక్టర్‌ ఆఫీస్‌లో కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జె.సూర్యనారాయణను నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీ చేశారు. కోటవురట్ల తహసీల్దార్‌ వైఎస్‌వీవీ ప్రసాదరావు, అనకాపల్లి కలెక్టరేట్‌లో అడ్మిన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎంఏ శ్రీనివాస్‌, మెజిస్టీరియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి.లక్ష్మిదేవిని, అనకాపల్లి కలెక్టరేట్‌లో ల్యాండ్‌ ఎక్విజేషన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ చంద్రశేఖర్‌ను అదే స్థానాల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  



ఈపీడీసీఎల్‌లో 284 మందికి స్థానచలనం

విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈగా సురేశ్‌కుమార్‌

విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఈపీడీసీఎల్‌లో భారీగా బదిలీలు జరిగాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నుంచి కార్పొరేట్‌ కార్యాలయంలో పనిచేసే చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వరకు అత్యధికులకు స్థానచలనం కలిగించారు. వీటిలో రాజకీయ సిఫారసులే అధికం. ఉద్యోగుల విన్నపాలు, నిబంధనల ప్రకారం చేసినవి చాలా స్వల్పం. గురువారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు విడుదల చేశారు. ఐదు జిల్లాల పరిధిలో మొత్తం 284 మందిని బదిలీ చేశారు. కార్పొరేట్‌ కార్యాలయంలో తొమ్మిది మంది సీజీఎంలు, ఏడుగురు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, 27 మంది ఈఈలు, 88 మంది డీఈలు, 153 మంది ఏఈలను బదిలీ చేశారు. విశాఖపట్నం సర్కిల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న ఎల్‌.మహేంద్రనాథ్‌ను కార్పొరేట్‌ కార్యాలయంలో ఐటీ విభాగానికి బదిలీ చేసి, అక్కడ విధులు నిర్వహిస్తున్న బాబ్జీ సురేశ్‌కుమార్‌కు విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈగా నియమించారు. అలాగే శ్రీకాకుళం ఎస్‌ఈగా పనిచేస్తున్న కె.చలపతిరావును విశాఖ కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేసి, ఇక్కడి నుంచి ఎల్‌.ప్రసాద్‌ను శ్రీకాకుళం ఎస్‌ఈగా వేశారు. 


డీఈవో కార్యాలయంలో బదిలీలు

జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారులు, మరికొందరు ఉద్యోగులకు బదిలీ అయ్యింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వున్న నిమ్మక ప్రేమకుమార్‌ను కాకినాడ ఆర్జేడీ కార్యాలయానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో విజయనగరం డీఈవో కార్యాలయం నుంచి ఏడీ లక్ష్మణరావుకు పోస్టింగ్‌ ఇచ్చారు. పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.దానయ్యను విజయవాడలో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరేట్‌కు బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న మురళిని ఇక్కడ నియమించారు.

జల వనరుల శాఖలో 100 మందికి...

ఉమ్మడి జిల్లా పరిధిలో జల వనరుల శాఖలో సుమారు 100 మంది మినిస్టీరియల్‌ సిబ్బందిని బదిలీ చేశారు. రెగ్యులర్‌ ఈఈ కార్యాలయంతోపాటు ఉత్తర కోస్తా చీఫ్‌ ఇంజనీరు, పలు ప్రాజెక్టుల్లో పనిచేసే సిబ్బందికి స్థానచలనం కలిగింది. ఒకేచోట ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేశారు. ఇంకా డీఈ, ఏఈలను ప్రభుత్వం బదిలీ చేసింది. 

డీఆర్‌డీఏలో 74 మంది...: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎ) పరిధిలో అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు 74 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మంది ఏపీఎంలతోపాటు సీసీలు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఏజెన్సీలో పనిచేసే వారిని మైదానానికి తీసుకువచ్చిన నేపథ్యంలో వారి స్థానంలో ఏడుగురిని అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు. 

అటవీ శాఖలో రేంజ్‌ అధికారుల బదిలీ

అటవీ శాఖ విశాఖ సర్కిల్‌ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో 18 మంది రేంజ్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇంకా ఫారెస్టు సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు, ఇతర సిబ్బందిని విశాఖలో కన్జర్వేటర్‌ బదిలీ చేశారు. 

గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి ఈఈగా ప్రసంగరాజు

నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం డీఈ ప్రసంగరాజుకు విశాఖ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంకా భీమిలి-1 డీఈగా వున్న జీఎస్‌ రంగనాఽథ్‌ను రంపచోడవరానికి బదిలీ చేసి, ఆయన స్థానంలో మాడుగుల డీఈ నాగరాజును నియమించారు. అనకాపల్లి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న డీఈ నీరజను విశాఖ నగరంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి, ఎలమంచిలి-1 డీఈ విజయలక్ష్మిని గాజువాకకు, ఎలమంచిలి-2 డీఈ కె.మల్లికార్జునరావును కోనసీమ జిల్లాకు, అనకాపల్లి డీఈ సత్యనారాయణను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. 

సంక్షేమ శాఖలో భారీగా బదిలీలు

బీసీ సంక్షేమ శాఖ విశాఖ జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది మంది వార్డెన్లకు, నలుగురు కుక్‌లకు, ఏడుగురు అసిస్టెంట్‌ కుక్‌లను, అనకాపల్లి జిల్లాలో 16 మంది వార్డెన్లు, 11 మంది కుక్‌లు, ఏడుగురు అసిస్టెంట్‌ కుక్‌లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక కుక్‌ను బదిలీ చేశారు. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పనిచేస్తున్న 46 మంది హాస్టల్‌ వార్డెన్లు, 18 మంది కుక్‌లు, 46 మంది అసిస్టెంట్‌ కుక్‌లు, ఇతర సహాయక సిబ్బందికి స్థానచలనం కలిగించా


ఎక్కడికక్కడ సర్దేసుకున్నారు!

నిబంధనలను పక్కనపెట్టేశారు

బదిలీలపై రెవెన్యూ ఉద్యోగుల్లో అసంతృప్తి

విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూలో బదిలీలపై సంబంధిత శాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రూపొందించిన జీవోను పూర్తిగా పక్కనపెట్టేశారని వాదన వినిపిస్తోంది. వాస్తవానికి నగరం నుంచి మైదానం/ఏజెన్సీకి బదిలీ చేయాలి. అలాగే ఏజెన్సీలో పనిచేస్తున్న వారికి నగరంతోపాటు పరిసరాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ తహసీల్దార్ల బదిలీలు పరిశీలిస్తే నగరం, పరిసరాలు, మైదానంలోని కొన్ని మండలాల మధ్యనే మార్పులు జరిగాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు...మారారని ఉద్యోగులు మండిపడుతున్నారు. దేవరాపల్లి నుంచి నర్సీపట్నం వరకు, నక్కపల్లి నుంచి సబ్బవరం వరకు తహసీల్దార్ల బదిలీలు దాదాపు ఇదేవిధంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేశారు తప్ప...నిబంధనలు ఏ కోశానా పాటించలేదని ఆరోపిస్తున్నారు. నాతవరం తహసీల్దార్‌గా పనిచేస్తున్న కె.జానకమ్మకు పాడేరు తహసీల్దారుగా పోస్టింగ్‌ ఇవ్వడాన్ని రెవెన్యూలో ఎక్కువమంది తప్పుబడుతున్నారు. ఆమె కర్ర సాయంతో నడుస్తుంటారని, అటువంటి అధికారిని పాడేరు ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆర్డర్‌ టూ సర్వ్‌ ప్రకారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల్లో ఎక్కువ మందిని అక్కడే కొనసాగించారని, రిక్వెస్టు పెట్టుకున్న వారి విజ.ప్తులను కూడా పరిగణనలోకి తీసుకోలేదనే ఆరోపణ వినిపిస్తోంది.  


 జీవీఎంసీలోనూ భారీగా....

పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ విభాగాల్లో పలువురికి స్థాన చలనం 

సిరిపురం, జూలై 1: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ విభాగాల్లో పలువురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సూపరింటెండెంగ్‌ ఇంజనీర్‌ శివప్రసాదరాజును సీఆర్‌డీఏ ఇన్‌చార్జి ప్రధాన ఇంజనీర్‌గా బదిలీ చేసి, ఆయన స్థానంలో కాకినాడ కార్పొరేషన్‌ ఎస్‌ఈ పీవీవీ సత్యనారాయణరాజును నియమించారు. జీవీఎంసీలో పనిచేస్తున్న మరో ఎస్‌ఈ కె.రాజారావును పబ్లిక్‌హెల్త్‌ ఎస్‌ఈగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏలూరులో ఎస్‌ఈగా పనిచేస్తున్న కె.రామమోహనరావును నియమించారు. స్మార్ట్‌ సిటీ ఎస్‌ఈ వినయ్‌కుమార్‌ను తిరుపతి బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏపీ టిడ్కో ఎస్‌ఈ వై.కృష్ణారావును నియమించారు. ఏలూరు కార్పొరేషన్‌లో కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఆర్‌.సుబ్బారావు, గుంటూరు ఈఈ వెంకటేశ్వరరావు, వేకెన్సీ రిజర్వులో వున్న ఈఈ డీవీ రమణమూర్తిలను జీవీఎంసీకి కేటాయించారు. జీవీఎంసీ ఈఈ రాయల్‌బాబు విశాఖలోని పబ్లిక్‌ హెల్త్‌ విభాగానికి బదిలీ చేశారు.

జీవీఎంసీ సీసీపీగా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రభాకర్‌ను వీఎంఆర్డీఏ సీయూపీగా బదిలీ చేసి, అతని స్థానంలో వీఎంఆర్‌డీఏ సీయూపీ బి.సురేష్‌ను నియమించారు.జీవీఎంసీలో టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో వున్న డీసీపీ డి.రాంబాబును అమరావతిలోని టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా, డీసీపీ వి.శిల్పను వీఎంఆర్డీఏ డిప్యూటీ సీయూపీగా బదిలీ చేశారు. వారి స్థానాల్లో వీఎంఆర్డీఏలో ప్లానింగ్‌ అధికారిగా వున్న సంజీవ్‌ రత్నకుమార్‌ను, బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీలో పనిచేస్తున్న కె.పద్మజను నియమించారు. జోన్‌ 1, 2 ఏసీపీగా పనిచేస్తున్న భాస్కర్‌బాబును తాడేపల్లిగూడెం, అనకాపల్లి ఏసీపీ టి.రోహిణిని పట్టణ ప్రణాళిక రీజనల్‌ ఆఫీస్‌కు బదిలీ చేశారు. వీరిస్థానంలో అనంతపురం నుంచి ఏసీపీ ఎ.శాస్ర్తి సహబాన్‌, శ్రీకాకుళంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న డి.శ్రీనివాసరావులను నియమించారు. ఇదిలావుండగా జీవీఎంసీ డీసీఆర్‌ నల్లనయ్యను జీవీఎంసీ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకూ అక్కడ పనిచేస్తున్న లావణ్యను కర్నూలు కార్పొరేషన్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు. డీపీఓలుగా పనిచేస్తున్న సీహెచ్‌ తిరుమలరావును ఏలూరుకు, శాంతకుమారిని శ్రీకాకుళం కార్పొరేషన్‌కు, జెడ్సీ బీవీ రమణను రాజమండ్రి కార్పొరేషన్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదోని మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణను జీవీఎంసీ జెడ్సీగా, కాకినాడ ఉప కమిషనర్‌ సీహెచ్‌ సత్యనారాయణరావును జీవీఎంసీలో డీపీఓగా బదిలీ చేశారు. జీవీఎంసీలో మరో జెడ్సీ డి.శ్రీధర్‌ను అమరావతి సచివాలయానికి బదిలీ చేయగా, పార్వతీపురం కమిషనర్‌ పి.సింహాచలంను గాజువాక జెడ్సీగా నియమించారు.

Updated Date - 2022-07-02T06:40:22+05:30 IST