Abn logo
Aug 9 2021 @ 20:58PM

కర్నూలు జిల్లాలో పోలీసులపై బదిలీ వేటు

కర్నూలు: జిల్లాలోని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై బదిలీ వేటు పడింది. జిల్లాలో మట్కా, గుట్కా, అక్రమ మద్యం వ్యాపారాల్లో పోలీసుల అవినీతి ఆరోపణలపై ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ముగ్గురు ఏఎస్సైలు,12 మంది హెడ్ కానిస్టెబుళ్లు, 17 మంది కానిస్టేబుళ్లు మొత్తం 32 మంది పోలీసులపై బదిలీ వేటు వేశారు. ఈ సంఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.