Abn logo
Jan 24 2021 @ 03:49AM

ఇద్దరు డిపో మేనేజర్ల బదిలీ

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలక్‌నుమా డిపో మేనేజర్‌ ఇషాఖ్‌ బిన్‌ అహ్మద్‌ను బదిలీ చేసి హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌లోని పార్సిల్‌ సర్వీసు ఏటీఎం-3గా నియమించారు.  దేవరకొండ డిపో మేనేజర్‌ ఎం.వేణుగోపాల్‌ను బదిలీ చేసి హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు కార్యదర్శిగా నియమించారు.

Advertisement
Advertisement
Advertisement