సిద్దిపేట జిల్లాలో పది మంది తహసీల్దార్ల బదిలీ

ABN , First Publish Date - 2020-10-01T09:56:36+05:30 IST

సిద్దిపేట జిల్లాలో పది మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దుబ్బాక

సిద్దిపేట జిల్లాలో పది మంది తహసీల్దార్ల బదిలీ

గజ్వేల్‌, సెప్టెంబరు 10: సిద్దిపేట జిల్లాలో పది మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు అనివార్యమైంది. సీసీఎల్‌ఏ నుంచి జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్‌కు పోస్టింగ్‌లు ఇస్తూ జిల్లాలోని పలువురు తహసీల్దారులను బదిలీ చేశారు. సీసీఎల్‌ఏ నుంచి ఎస్‌.రాజేందర్‌రెడ్డిని దుబ్బాక తహసీల్దార్‌గా, హేమమాలినిని గజ్వేల్‌కు, ఎం.శ్రీనివా్‌సరావును కొమురవెల్లి తహసీల్దార్‌గా, పి.శ్రీనివా్‌సరావును దౌల్తాబాద్‌ తహసీల్దార్‌గా, పి.శ్రీనివా్‌సరెడ్డిని రాయపోల్‌ తహసీల్దార్‌గా, దుబ్బాకలో పనిచేస్తున్న రామచంద్రంను కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌గా, దౌల్తాబాద్‌లో పనిచేస్తున్న ఉమారాణిని సిద్దిపేట రూరల్‌ తహసీల్దార్‌గా, తొగుటలో పనిచేస్తున్న బాల్‌రెడ్డిని కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. గజ్వేల్‌ తహసీల్దార్‌ మహమ్మద్‌ అన్వర్‌ను గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయ డీఏవోగా, గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయ డీఏవోగా పనిచేస్తున్న ఎస్‌ఏ.మథీన్‌ను తొగుట మండల తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులను విడుదల చేశారు. 


మెదక్‌ జిల్లాకు ముగ్గురు తహసీల్దార్ల కేటాయింపు

మెదక్‌ రూరల్‌: మెదక్‌ జిల్లా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ముగ్గురు తహసీల్దార్లను కేటాయిస్తూ ఉత్వర్వులను జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశంను కలెక్టరేట్‌లోని ఈ సెక్షన్‌లో నియమించారు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన బివి శైలేంద్రకుమార్‌ను కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా నియమించారు. అదే జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్‌ను పెద్దశంకరంపేట తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-10-01T09:56:36+05:30 IST