Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీ

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ అయ్యారు. రాజారావును నెల్లూరు జైలు శాఖ ట్రైనింగ్ సెంటర్ సూపరింటెండెంట్‌గా బదిలీ చూస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జైలు శాఖ ట్రైనింగ్ సెంటర్ సూపరింటెండెంట్ కిశోర్ కుమార్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. 2015 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గాను, 2020 నుంచి సూపరింటెండెంట్‌గా రాజారావు పనిచేస్తున్నారు. జైలులో సంస్కరణలు చేపట్టి ఖైదీల్లో సత్ప్రవర్తనకు రాజారావు కృషి చేసారు. రాజకీయ ఒత్తిళ్ళతో రాజారావును బదిలీ చేశారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. దేవినేని ఉమా జైలులో రిమాండ్‌గా ఉన్న నేపథ్యంలో రాజారావు బదిలీపై చర్చ జరుగుతోంది. 

Advertisement
Advertisement