పార్వతీపురం రూరల్, జూలై 2 : జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మినాయుడుకు అనకాపల్లి జిల్లాకు బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో అనకాపల్లి నుంచి రఘురాం నియామకమయ్యారు. కూర్మినాయుడు శనివారం విధుల నుంచి రిలీవయ్యారు. కొత్త పీడీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదిలాఉండగా గృహ నిర్మాణ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్‌కు విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యింది. ఆయన త్వరలోనే రిలీవ్ కానున్నారు.