రాయచోటి/కలెక్టరేట్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలో 14 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ గురువారం రాత్రి కడప జిల్లా కలెక్టర్ విజయరామ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా ప్రతిపాదనల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా వీటిని చేపట్టారు. ప్రస్తుతం లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై పని చేస్తున్న రాజంపేట తహసీల్దార్ ఎన్.రవిశంకర్‌రెడ్డి రాయచోటి తహసీ ల్దార్‌గా నియమితులవగా, ఇక్కడ పనిచేస్తున్న ఎం.వి.సుబ్రమణ్యం రెడ్డి రాజంపేటకు బదిలీ అయ్యారు. పెద్దమండ్యం తహసీల్దార్ ఎస్. మహే శ్వరిబాయి సంబేపల్లెకు, ఇక్కడ పనిచేస్తున్న వైఎస్.సత్యానందం (ప్రస్తుతం చిట్వేలి తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌లో ఉన్నారు.) చిట్వేలికి బదిలీ అయ్యారు. రామాపురం తహసీల్దార్ మహబూబ్‌చాంద్ (ప్రస్తుతం చిన్నమండెం తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌లో ఉన్నారు) సుండుపల్లె తహ సీల్దార్‌గా బదిలీ అయ్యారు. అలాగే లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్ ఎ.తుల శమ్మ (ప్రస్తుతం వీరబల్లి తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌లో ఉన్నారు) వీర బల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడి తహసీల్దార్ కె.బాలకృష్ణ (ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు) కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఆర్డర్ టు సర్వ్ ద్వారా కలెక్టరేట్‌కు వచ్చి ప్రస్తుతం రైల్వేకోడూరు తహ సీల్దార్‌గా డిప్యుటేషన్ మీద ఉన్న బి.రామ్మోహన్ రైల్వేకోడూరు తహసీ ల్దార్‌గా నియమితులయ్యారు. కాగా రైల్వేకోడూరు తహసీల్దార్ జె.శిరీష (ప్రస్తుతం రాజంపేట తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై ఉన్నారు) రాజంపేట తహసీ ల్దార్‌గా బదిలీ అయ్యారు. ములకలచెరువు తహసీల్దార్ సి.శ్రీని వాసులు గాలివీడుకు బదిలీ కాగా, ఇక్కడ పనిచేస్తున్న శ్రావణి కలెక్ట రేట్‌లో సూపరిండెంట్‌గా బదిలీ అయ్యారు. రామాపురం తహసీల్దార్ ఖాజాబీ వైఎస్‌ఆర్ జిల్లాకు బదిలీ అయ్యారు. అలాగే కె.వి.పల్లె తహసీల్దార్ నాగప్రసన్న లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు. కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్ బి.మహేశ్వర్‌రెడ్డి అన్నమయ్య కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.
మరో 8 మంది తహసీల్దార్ల బదిలీ
అన్నమయ్య జిల్లాకు సంబంధించి 14 మంది తహసీల్దార్లను గురువారం అర్ధరాత్రి దాటాకా వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వగా, మరో 8 మందిని బదిలీ చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆదేశాలిచ్చారు. వీరందరూ చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు బదిలీపై రానున్నారు. వీరిలో కె.నిర్మలాదేవి పెద్దమండ్యం తహసీల్దార్‌గా, ఎం.మహేశ్వర్‌రావు కురబల కోట తహసీల్దార్‌గా, బీసీ కృష్ణమోహన్ గుర్రంకొండ తహసీల్దార్‌గా, ఎం. శ్రీనివాసులునాయక్ కలకడ తహసీల్దార్‌గా, కె.ధనాంజనేయులు బి.కొత్తకో ట తహసీల్దార్‌గా, వి.వెంకటచలపతి మొలకలచెరువు తహసీల్దార్‌గా, కె.భాగ్యలత కలికిరి తహసీల్దార్‌గా, ఎ.కళావతి తంబళ్లపల్లె తహసీల్దార్‌గా, ఇందులో మరికొంత మంది డిప్యూటీ తహసీల్దార్లు మహమ్మద్ అజరు ద్దీన్ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-2 పీలేరు నుంచి కేవీ పల్లె మండలం, లక్ష్మయ్య కేవీపల్లె నుంచి జీఎన్‌ఎస్‌ఎస్-2 పీలేరుకు, హరిప్రసాద్‌ను తంబళ్లపల్లె పరిపాలన డీటీగా, విజయసాగర్ డిప్యూటీ తహసీల్దార్‌గా మదనపల్లె నుంచి పీటీఎం డీటీగా, బాబాజాన్‌ను పీటీఎం నుంచి డీటీగా మదనపల్లెకు, పద్మనాభంను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 నుంచి కలికిరికి, కె.భువనేశ్వరిని ఎలెక్షన్ డ్యూటీ మదనపల్లె నుంచి డీటీగా రామసముద్రానికి డిప్యుటేషన్‌పై పంపారు.