ఎమ్మెల్యేను కలిసిన ట్రాన్స్‌కో అధికారులు

ABN , First Publish Date - 2021-09-07T17:38:40+05:30 IST

లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకే..

ఎమ్మెల్యేను కలిసిన ట్రాన్స్‌కో అధికారులు

చిలుపూర్‌లో సబ్‌స్టేషన్‌ ఏర్పాటుపై చర్చ

ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్యతో సమావేశమైన ట్రాన్స్‌కో డీఈఈ సదానందం


చిలుపూర్‌: లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకే చిలుపూర్‌లో సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో డీఈఈ సదానందం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్యను కలిసి చర్చించారు. ఈ నెల 9న చిలుపూర్‌ గుట్టలో నిర్మించే సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఈఈ సదానందం మాట్లాడుతూ, రాజవరం సెక్షన్‌ పరిధిలో రాజవరం, మల్కాపూర్‌, ఫతేపూర్‌, చిన్నపెండ్యాలలో కలిపి 4 సబ్‌స్టేషన్లు ఉన్నాయని, పెరిగిన సాగునీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని చిలుపూర్‌ గుట్టలో మరో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ పాపిరెడ్డి, సబ్‌ ఇంజనీర్‌ సాధనరెడ్డి పాల్గొన్నారు. 


రాజవరం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాజయ్యను స్టేషన్‌ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల మల్లయ్య, ఎమ్డీ యాకూబ్‌, వెంకటస్వామి, కరునాకర్‌, మల్లయ్య, రంగు రవి తదితరులు పాల్గొన్నారు. 


కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

లింగాలఘణపురం: మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 25 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ ధీరజ్‌కుమార్‌, ఎంపీవో మల్లికార్జున్‌, ఏపీఎం శంకరయ్య, నాయకులు నాగేందర్‌, గవ్వల మల్లేశం, ఊడ్గుల భాగ్యలక్ష్మి, శ్రీహరి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-07T17:38:40+05:30 IST