ట్రాన్సకో ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-08-09T05:44:05+05:30 IST

విద్యుత సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కళ్యాణ దుర్గం పట్ణణంలోని ట్రాన్సకో కార్యాలయం వద్ద ట్రాన్సకో ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు.

ట్రాన్సకో ఉద్యోగుల నిరసన
కళ్యాణదుర్గంలో నిరసన తెలుపుతున్న ట్రాన్సకో ఉద్యోగులు

 కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌), ఆగస్టు 8 : విద్యుత సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కళ్యాణ దుర్గం పట్ణణంలోని ట్రాన్సకో కార్యాలయం వద్ద ట్రాన్సకో ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు. ఈ విద్యుత సవరణ చట్టంతో విద్యుత రంగాన్ని  ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, భవిష్య త్తులో విద్యుత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగు తుందని అన్నారు.  ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకుండా స్తబ్ధతగా ఉందని తెలిపారు. కార్యక్ర మంలో వైఎండీ జేఏసీ సెకరెట్రి సలీం, జేఏసీ ప్రెసిడెంట్‌ రవి, జేఏసీ కన్వీనర్‌ శివలింగేశ్వరయ్య, డివిజనల్‌ సెక్రెటరీ రవీంద్రరెడి,్డ నాగేంద్ర, ట్రాన్సకో ఉద్యోగులు పాల్గొన్నారు.  

 


Updated Date - 2022-08-09T05:44:05+05:30 IST