Abn logo
Sep 30 2020 @ 05:15AM

మార్చి నాటికి పంపుసెట్లకు మీటర్లు బిగించాలి

 ట్రాన్స్‌కో డీఈ శేషాద్రిశేఖర్‌ 


కళ్యాణదుర్గం, సెప్టెంబరు 29: వ్యవసా య పంపుసెట్లకు మార్చి నాటికి మీటర్లు బిగించాలని ట్రాన్స్‌కో డీఈ శేషాద్రిశేఖర్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రామ్మోహన్‌తో కలిసి ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైఎ్‌సఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం విధివిధానాలను తెలియజేశారు. మీటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే మీటర్ల ఏర్పాటు పద్ధతిని ప్రవేశ పెట్టామన్నారు.


ప్రతి రైతుకు ప్రభుత్వమే నెలసరి విద్యుత్‌ బిల్లును వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. విద్యుత్‌ నాణ్యత, లోఓల్టేజ్‌, సరఫరాలో అంతరాయం లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కల్పించాలన్నారు. రాబోవు 30 ఏళ్లు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ అందజేయగానికి 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును ప్రభుత్వమే ఏర్పా టు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ పరిధిలోని ఏడీఏలు, ఏఈలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement