ట్రంకురోడ్డు కల్వర్టు పనుల ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-19T02:59:43+05:30 IST

ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన ‘నాలుగు నెలలుగా నరకమే’ అనే కథనానికి అధికారులు స్పందించి, బుధవార

ట్రంకురోడ్డు కల్వర్టు పనుల ప్రారంభం
ట్రంకురోడ్డులో జరుగుతున్న కల్వర్టు పనులు


ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కావలిటౌన్‌, మే18: ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన ‘నాలుగు నెలలుగా నరకమే’ అనే కథనానికి  అధికారులు స్పందించి, బుధవారమే కల్వర్టు పనులు ప్రారంభించారు. ట్రంకురోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రూ.100కోట్లతో ప్రారంభించిన పనుల్లో ముసునూరు అటోనగర్‌ వద్ద ట్రంకురోడ్డుపై కల్వర్టు నిర్మాణానికి రోడ్డుకడ్డంగా గుంట తవ్వారు. దీంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దాదాపుగా నాలుగు నెలలుగా ఇదే దుస్ధితి ఉండడంతో ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. స్పందించిన రోడ్లు, భవనాల శాఖ ఈఈ రామకృష్ణ వెంటనే కల్వర్టు పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించా రు. దీంతో బుధవారం  పనులను ప్రారంభించారు. 


Updated Date - 2022-05-19T02:59:43+05:30 IST