రెండు నెలల తర్వాత పట్టాలెక్కనున్న రైళ్లు

ABN , First Publish Date - 2020-06-01T09:21:41+05:30 IST

రెండు నెలల తర్వాత సోమవారం దేశవ్యాప్తంగా 200రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అందులో భువనేశ్వర్‌ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్‌ఎక్స్‌ప్రెస్‌,

రెండు నెలల తర్వాత పట్టాలెక్కనున్న రైళ్లు

తాండూరు: రెండు నెలల తర్వాత సోమవారం దేశవ్యాప్తంగా 200రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అందులో భువనేశ్వర్‌ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్‌ఎక్స్‌ప్రెస్‌, నాంపల్లి నుంచి ముంబయి వెళ్లే హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వికారాబాద్‌, తాండూరు రైల్వేస్టేషన్ల మీదుగా బయల్దేరనున్నాయి. ఇప్పటికే 200 రైళ్లలో ప్రయాణికులకు అన్ని రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్‌ టికెట్లను అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్వే సిబ్బంది రైళ్ల రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు.


రైలు ప్రయాణికులు మాస్కులు ధరించారా? భౌతికదూరం పాటిస్తున్నారా?.. అనే విషయాన్ని పరిశీలించాలని రైల్వే పోలీసులకు ఆదేశాలు అందాయి. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు కోణార్క్‌, సాయం త్రం 4.40గంటలకు హుస్సేన్‌సాగర్‌, రాత్రి 7.30 గంటలకు  రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తాండూరు రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లనున్నాయి. అయితే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం అక్కడి నుంచి బయల్దేరడం ఆలస్యమైతే మంగళవారం తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2020-06-01T09:21:41+05:30 IST