పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు

ABN , First Publish Date - 2022-07-06T05:55:02+05:30 IST

కొవిడ్‌కి ముందు ప్యాసింజర్‌ రైళ్లుగా నడిచి నిలిచిపోయిన కొన్ని రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలతో వచ్చేవారం నుంచి రైల్వే శాఖ పట్టాల మీదకు తీసుకురానున్నట్లు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు

గుంటూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌కి ముందు ప్యాసింజర్‌ రైళ్లుగా నడిచి నిలిచిపోయిన కొన్ని రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలతో వచ్చేవారం నుంచి రైల్వే శాఖ పట్టాల మీదకు తీసుకురానున్నట్లు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. నెంబరు. 07279 విజయవాడ - తెనాలి రైలు ఈ నెల 15వ తేదీ నుంచి వేకువజామున 5.10 గంటలకు బయలుదేరి 6.10కి తెనాలి చేరుకొంటుంది. నెంబరు.07575 తెనాలి - విజయవాడ రైలు నిత్యం 6.30కి బయలుదేరి 7.30కి విజయవాడ చేరుతుంది. నెంబరు.07976 గుంటూరు - విజయవాడ రైలు నిత్యం ఉదయం 6.25కి బయలుదేరి 7.40కి విజయవాడ చేరుకొంటుంది. నెంబరు. 07464 విజయవాడ - గుంటూరు రైలు నిత్యం మధ్యాహ్నం 12.25కి బయలుదేరి 1.55కి గుంటూరు చేరుతంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ రైలు సర్వీసు ప్రారంభం కానుంది. నెంబరు.07465 గుంటూరు - విజయవాడ రైలు నిత్యం మధ్యాహ్నం 2.10కి బయలుదేరి 3.20కి విజయవాడ చేరుకొంటుంది.  

నేడు గుంటూరు - విశాఖపట్టణం ప్రత్యేక రైలు

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బుధవారం గుంటూరు - విశాఖపట్టణం ప్రత్యేక రైలుని నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబరు.07596 గుంటూరు - విశాఖపట్టణం రైలు రాత్రి 9.10కి బయలుదేరి 4.30కి విశాఖపట్టణం చేరుకొంటుంది. ఈ రైలులో 10 జనరల్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీలుంటాయి. 


Updated Date - 2022-07-06T05:55:02+05:30 IST