రైళ్ల వేగం.. 120 కి.మీ

ABN , First Publish Date - 2021-03-04T06:35:12+05:30 IST

గుంటూరు రైల్వే డివిజన్‌లో బ్రాంచ్‌ మార్గాలు మినహా అంతటా 120 కిలోమీటర్ల వేగంతో రైళ్ల ప్రయాణానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్య అనుమతి ఇచ్చారు.

రైళ్ల వేగం.. 120 కి.మీ
బెల్లంకొండ రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న జీఎం గజానన్‌ మల్యా

అనుమతి ఇచ్చిన రైల్వే జీఎం 

గుంటూరు డివిజన్‌లో  గజానన్‌ తనిఖీలు


గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే డివిజన్‌లో బ్రాంచ్‌ మార్గాలు మినహా అంతటా 120 కిలోమీటర్ల వేగంతో రైళ్ల ప్రయాణానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్య అనుమతి ఇచ్చారు. బుధవారం ఆయన మాచర్ల నుంచి మంగళగిరి వరకు వార్షిక తనిఖీ చేశారు. రెడ్డిగూడెం, సత్తెనపల్లి సెక్షన్‌ మధ్యన ధూళిపాళ్ల వాగుపై భారీ వంతెన నెం బరు. 48, మలుపు నెంబరు. 11ని పరిశీ లించారు. సత్తెనపల్లి - సిరిపురం, గుం టూరు - మంగళగిరి మధ్యన వేగ పరీక్ష నిర్వహించారు. బండారుపల్లి - నల్ల పాడు మధ్యన ఆర్‌యూబీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 


గుంటూరు - కాచిగూడ సమయపట్టిక మార్చాలి

గుంటూరు - కాచీగూడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ సమయపట్టికను మార్పు చే యాలని జడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌కి విజ్ఞప్తి చేశా రు. గుంటూరులో ఆయనను కలిసిన జడ్‌ ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పు లూరి శశిధర్‌ చౌదరి వినతి పత్రం అందజేశారు. గుంటూ రు వైపు నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరితే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా కూడా నంద్యాల ప్రాంత ప్రయాణికు లకు ఉపయోగపడుతుంద న్నారు. కాచీగూడ వైపు నుంచి వచ్చేట ప్పుడు వేకువజామున 4.15 గంటలకు నంద్యాలకు వచ్చేలే రీ షెడ్యూల్‌ చేయాల న్నారు. రేపల్లె - సికిం ద్రాబాద్‌ డెల్టా ఎక్స్‌ ప్రెస్‌ వేకువజామున 5 గంటలకల్లా సికింద్రాబాద్‌ చేరుకునేలా చూడాలన్నారు. విజయవాడ - చెన్నై సెంట్రల్‌ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8.30 గంటలకు చెన్నై సెంట్రల్‌కి చేరుకునేలా చూడాలన్నారు. రత్నాచల్‌, ఉదయ్‌  ఎక్స్‌ప్రెస్‌లను గుంటూరు వరకు పొడి గించాలని కోరారు. విశాఖపట్టణం - లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ ఎక్స్‌ప్రెస్‌ని గుంటూరు, నడికుడి మార్గంలో మళ్లిం చాలన్నారు. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ని కూడా నంద్యాల మార్గంలో గుంటూరు మీదగా మళ్లింపు చేయాలన్నారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ని డైలీ సర్వీసుగా చేయల న్నారు. పూణే - భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో నిలుపుదల సౌకర్యం కల్పించాలన్నారు. సర్కారు ఎక్స్‌ప్రెస్‌కి న్యూగుంటూరు స్టేషన్‌లో తొలగించిన నిలుపుదల సౌకర్యాన్ని పునరు ద్ధరించాలని కోరారు.


అభివృద్ధి పనుల ప్రారంభం

మాచర్ల రూరల్‌, దాచేపల్లి, రెంటచింతల, బెల్లంకొండ: దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌మాల్య బుధవారం జిల్లాలోని దాచేపల్లి, రెంటచింతల, బెల్లంకొండ రైల్వేస్టేషన్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని పలు అభివృద్ధి పను లను ప్రారంభించారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన తొలుత మాచర్ల రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్లో జరు గుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దాచేపల్లి స్టేషన్‌ పరిధిలోని అంజనాపురం కాలనీలో ఉన్న చిల్డ్రన్స్‌ పార్కు, వి శ్రాంతి గదులనుప్రారంభించారు. రైల్వేస్టేషన్‌ ఆవరణ, ఆసుపత్రులు, క్వార్టర్స్‌, స్టేషన్‌లోని కంప్యూటర్‌, రికార్డులను తని ఖీ చేశారు. రైల్వే ట్రాక్‌ వద్ద అండర్‌ పాస్‌ల్లో నీరు నిలిచి పొలాలకు వెళ్లేం దుకు ఇబ్బంది పడుతున్నామని నడికుడి, వీరాపురం రైతులు జీఎంకు ఫిర్యాదు చేశారు. అండర్‌పాస్‌లను  పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెంటచింతలలోని మాచర్ల గుంటూరు రైల్వే ట్రాక్‌ను జీఎం పరిశీలించారు. ఆర్‌యూబీని పరిశీలించి డ్రెయినేజి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాట్‌ ఫాం, విద్యుద్ధీకరణ పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మాచర్ల బీమవరం రైలును పున రుద్ధరిం చాలని ప్రయాణికులు జీఎంను కోరారు. అనంతరం బెల్లంకొండకు వెళ్లిన జీఎం రైల్వేస్టేషన్‌ పక్కన ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించి స్టేషన్‌మాస్టర్‌ చెన్నకేశవరెడ్డిని అభినందించారు. అనంతరం రెస్ట్‌రూమ్‌లను ప్రారంభించారు. ఎల్‌ సీ నెంబర్‌ 53 గేట్‌ను తనిఖీ చేశారు. జీఎం వెంట ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరి ఈశ్వరరావు, ఇంజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సత్యహరప్రసాద్‌, డీఆర్‌ఎం మోహనరాజు, డీవోఎం రాం బాబు, మధుబాబు, పాండురంగ ఉన్నారు. 

Updated Date - 2021-03-04T06:35:12+05:30 IST