రైతులకు శిక్షణ కార్యక్రమం

ABN , First Publish Date - 2021-08-04T05:09:13+05:30 IST

రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని తాళ్లపాక, పాటూరు గ్రామాల్లో మంగళవారం జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతులకు శిక్షణ  కార్యక్రమం
పాటూరు గ్రామ పొలంలో రైతులకు శిక్షణ ఇస్తున్న జిల్లా వనరుల కేంద్ర అధికారులు

రాజంపేట, ఆగస్టు3 : రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని తాళ్లపాక, పాటూరు గ్రామాల్లో మంగళవారం జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామాల్లో ప్రధానంగా వరిపంట సాగు చేయడం వల్ల వరిపంట సాగులో మెళుకువలు, అధిక దిగుబడికి తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల వాడకం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. డాట్‌ సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ కె.పద్మోదయ, ఆత్మా డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్‌ ఐ.జె.మైఖెల్‌రాజు, రైతు శిక్షణ సహాయ సంచాలకురాలు కె.లక్ష్మీదేవి, డాట్‌ టెక్నాలజీ మేనేజర్‌ ఓ.బి.సుబ్రహ్మణ్యంకుమార్‌, వ్యవసాయ సహాయకులు జయపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-04T05:09:13+05:30 IST