డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో ఆధ్యాత్మిక వస్తువుల తయారీపై శిక్షణ

ABN , First Publish Date - 2021-09-29T06:23:14+05:30 IST

డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించే పుష్పాలను ఆధ్యాత్మిక వస్తువులుగా తయారు చేసే శిక్షణను మంగళవారం జేఈవో సదాభార్గవి ప్రారంభించారు.

డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో ఆధ్యాత్మిక వస్తువుల తయారీపై శిక్షణ

తిరుపతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించే పుష్పాలను ఆధ్యాత్మిక వస్తువులుగా తయారు చేసే శిక్షణను మంగళవారం జేఈవో సదాభార్గవి ప్రారంభించారు. పేరూరు సమీపంలోని చీని నిమ్మ పరిశోధన కేంద్రంలో స్థానిక మహిళలకు మూడు రోజులు ఈ శిక్షణ ఇస్తారు. ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతాచిత్రపటాలు, కీ చైన్లు, పేపర్‌ వెయిట్స్‌ తయారీకి వై.ఎ్‌స.ఆర్‌. ఉద్యాన వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన వర్సిటీ వీసీ జానకి రాం, వెటర్నరీ వర్సిటీ వీసీ పద్మనాభరెడ్డి, ఉద్యాన వర్సిటీ అధికారులు కె.గోపాల్‌, ఆర్‌.వి.ఎ్‌స.కె.రెడ్డి, వెంకటరమణ, కరుణశ్రీ, శ్రీనివాసులు, విద్యారాణి, చీని నిమ్మ పరిశోధన కేంద్రం ఇన్‌చార్జి నాగరాజు, టీటీడీ డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T06:23:14+05:30 IST