చిత్తూరు (సెంట్రల్), జనవరి 26: ‘చదవడం మా కిష్టం’ అనే అంశంపై బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని ఎస్ఎస్ ఏపీసీ వెంకటరమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో మండలం నుంచి ఎంపిక చేసిన 10 మంది టీచర్లకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.
దీక్ష కార్యక్రమంపైనా..
దీక్ష కార్యక్రమంపైనా బుధవారం నుంచి ఈనెల 30వ తేదీవరకు శిక్షణ తరగతులు ఉంటాయని డీఈవో నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు డివిజన్ ఉపాధ్యాయులకు వేము ఇంజనీరింగ్ కళాశాలలో, మదనపల్లె డివిజన్ ఉపాధ్యాయులకు అంగళ్లులోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో, పుత్తూరు డివిజన్ ఉపాధ్యాయులకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో, తిరుపతి డివిజన్ ఉపాధ్యాయులకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు.