జోరువాన

ABN , First Publish Date - 2022-05-27T04:59:36+05:30 IST

జోరువాన

జోరువాన
తాండూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న మురుగు కాల్వ

  •  లోతట్టు ప్రాంతాలు జలమయం.. రోడ్లపై ప్రవహించిన వరద

తాండూరు/ఘట్‌కేసర్‌, మే26: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రం జోరువాన కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. బసవన్నకట్ట, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట రోడ్డు గుంతలు పడడంతో వరదనీరు నిలిచింది. మురుగు కాల్వలు పొంగిపొర్లాయి. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో మోస్తరు వర్షం కురిసింది. రహదారులు వరదనీటితో నిండిపోయాయి. కాగా ఎండ  వేడిమితో అల్లాడుతున్న జనం ఒక్కసారిగా వాతవరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. వర్షం పలకరించడంతో హమ్మయ్య అంటు  ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2022-05-27T04:59:36+05:30 IST