శిక్షణ తరగతుల వల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2021-02-25T03:28:22+05:30 IST

నైపుణ్యాభివృద్ధి నిర్వహించే శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం వల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని జేసీ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

శిక్షణ తరగతుల వల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న జేసీ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  జేసీ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి


వెంకటాచలం, ఫిబ్రవరి 24 : నైపుణ్యాభివృద్ధి నిర్వహించే శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం వల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని  జేసీ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో నైపుణ్యాభివృద్ధి సంస్థ, యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులను బుధవారం ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ ఎం.చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జేసీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో చేపడుతున్నారన్నారు. దీన్ని యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నామని, రానున్న రోజుల్లో నైపుణ్యాభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోనుందన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, శిక్షణ తరగతుల ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ అబ్దుల్‌ ఖయ్యుమ్‌, శిక్షణ తరగతుల సమన్వయకర్త డాక్టర్‌ సీహెచ్‌. విజయ, ఉప సమన్వయకర్త డాక్టర్‌  విద్యా ప్రభాకర్‌, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T03:28:22+05:30 IST