యువత ఉపాధి కోసం శిక్షణ కేంద్రం

ABN , First Publish Date - 2021-08-04T05:24:17+05:30 IST

బొడ్డవర ప్రాంతంలో అల్యూమినా పరిశ్రమ (జిందాల్‌) ఏర్పాటుకు 1162 ఎకరాలను గతంలో సేకరించామని, పరిశ్రమ ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో యువతకు వివిధ అంశాల్లో శిక్షణ కోసం మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని జిందాల్‌ డైరెక్టర్‌ రాచూరి కనకరావు తెలిపారు. చీడిపాలెంలోని సంస్థ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

యువత ఉపాధి కోసం శిక్షణ కేంద్రం
జిందాల్‌ కంపెనీ డైరెక్టర్‌ రాచూరి కనకరావు

జిందాల్‌ కంపెనీ డైరెక్టర్‌ రాచూరీ కనకకరావు

శృంగవరపుకోట రూరల్‌, ఆగస్టు 3 : బొడ్డవర ప్రాంతంలో అల్యూమినా పరిశ్రమ (జిందాల్‌) ఏర్పాటుకు  1162 ఎకరాలను గతంలో సేకరించామని,  పరిశ్రమ ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో యువతకు వివిధ అంశాల్లో శిక్షణ కోసం మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని జిందాల్‌ డైరెక్టర్‌ రాచూరి కనకరావు తెలిపారు. చీడిపాలెంలోని సంస్థ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 2008 నుంచి బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతుల కోసం వేచిచూశామని, ఈ ప్రభుత్వం కూడా బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి నిరాకరించడంతో తమ సంస్థ యాజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా తమ భూములను ప్రభుత్వ నిబంధనల మేరకు లీజుకు ఇస్తామన్నారు. కొన్ని టైక్స్‌టైల్స్‌ సంస్థలు వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కోసం 30 ఎకరాల్లో ప్రత్యేక భవనం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ కన్సల్టెంట్లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-04T05:24:17+05:30 IST