Trainer Aircraft Crashes : మహారాష్ట్రలో కూలిన ట్రైనర్ విమానం..

ABN , First Publish Date - 2022-07-25T21:36:43+05:30 IST

మహారాష్ట్ర(Maharastra)లోని పుణె(Pune) జిల్లాలో సింగిల్ -సీటర్ ట్రైనర్ విమానం(Trainer Aircraft) కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో పొలంలో పడిపోయింది.

Trainer Aircraft Crashes : మహారాష్ట్రలో కూలిన ట్రైనర్ విమానం..

పుణె : మహారాష్ట్ర(Maharastra)లోని పుణె(Pune) జిల్లాలో సింగిల్ -సీటర్ ట్రైనర్ విమానం(Trainer Aircraft) కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలెట్(Trainee Pilot) భావికా రాథోడ్‌కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేర్పించామని చెప్పారు. ఇందాపూర్ తహశీల్‌లోని కడ్బన్‌వాడీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పుణెలోని బారామతి ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం ప్రమాదంలో దెబ్బతిన్నదని వివరించారు.


ఈ ఘటనపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. గాయపడ్డ పైలెట్ భావికా రాథోడ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ప్రమాదానికి గల కారణంపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) (DGCA) దర్యాప్తు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. కాగా ప్రమాదానికి గురైన విమానం ప్రైవేటు ఏవియేషన్ స్కూల్ ‘కర్వీర్ ఏవియేషన్’కు చెందినది. మహారాష్ట్రలోని బారామతిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 



Updated Date - 2022-07-25T21:36:43+05:30 IST