RUSSIA NAVY బేస్‌కు డాల్ఫిన్స్ ఆర్మీ రక్షణ

ABN , First Publish Date - 2022-04-29T00:00:18+05:30 IST

మాస్కో : ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. నల్ల సముద్రంలోని తమ నావల్ బేస్‌ను రక్షించేందుకు సుశిక్షిత డాల్ఫిన్ల ఆర్మీని రష్యా మోహరించింది.

RUSSIA NAVY బేస్‌కు డాల్ఫిన్స్ ఆర్మీ రక్షణ

మాస్కో : UKRAINతో యుద్ధం కొనసాగుతున్న వేళ.. నల్ల సముద్రంలోని తమ నావల్ బేస్‌ను రక్షించేందుకు సుశిక్షిత డాల్ఫిన్ల ఆర్మీని RUSSIA మోహరించింది. సెవాస్టోపోల్ హార్బర్ ప్రవేశం వద్ద తేలియాడే రెండు Dolphins వలయాలు(కంచెలు) గుర్తించామని US NAVAL INSTITUTE (యూఎస్‌ఎన్ఐ) రిపోర్ట్ వెల్లడించింది. నల్ల సముద్రంలోని ఈ బేస్ రష్యాకు అత్యంత కీలకమైనది. SATILITE IMAGES ఆధారంగా డాల్ఫిన్ ఆర్మీ పహారా కాస్తోందని గుర్తించామని యూఎస్‌ఎన్ఐ రిపోర్ట్ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరిలోనే ఈ డాల్ఫిన్లను అక్కడి తరలించినట్టు రిపోర్ట్ తెలిపింది. 


ఏమిటీ RUSSIA Dolphins ARMY ?

సముద్రంలో శబ్ధాలు, ఏ వస్తువు ఎంత దూరంలో ఉందో గుర్తించి స్పందించగల సహజ లక్షణం డాల్ఫిన్ల సొంతం. ఈ కారణంగానే నల్లసముద్రంలోని నావల్ బేస్ రక్షణ కోసం రష్యా డాల్ఫిన్ ఆర్మీని మోహరించిందని NEWSWEEK రిపోర్ట్ పేర్కొంది. నీటి తరంగాల వ్యత్యాసాన్ని బట్టి ఒక వస్తువు ఎంతదూరంలో ఉందో డాల్ఫిన్లు గుర్తించగలవు. అవసరాన్ని బట్టి ఆ దిశగా వెళ్లగలవు. బంతి సాంద్రతను బట్టి ఏది గోల్ఫ్ బాల్, ఏది పింగ్-పాంగ్ బాల్‌ అనేది డాల్ఫిన్స్ ఇట్టే గుర్తించగలవు. నల్ల సముద్రంలోని రష్యా నౌకలు.. UKRAIN క్షిపణుల దాడి పరిధిలో లేవు. అయితే నీటి కింద నుంచి దాడులకు అవకాశం లేకపోలేదు. ఇలాంటి అనూహ్యదాడులు ఎదురైతే అడ్డుకునేందుకే ఈ డాల్ఫిన్ ఆర్మీని రష్యా మోహరించినట్టు NEWSWEEK రిపోర్ట్ పేర్కొంది. నౌకలకు రక్షణతోపాటు ఎదురుదాడి ఆపరేషన్లు నిర్వహించడంలో డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చారని యూఎస్ఎన్ఐ రిపోర్ట్ పేర్కొంది.


AMERICA కూడా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోందా?

అమెరికన్ నేవీ కూడా 1959 నుంచి డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోందని న్యూస్‌వీక్ రిపోర్ట్ పేర్కొంది. మెరైన్ మమ్మల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా US NAVY పలు జంతువులను పరీక్షించింది. ఈ జాబితాలో డాల్ఫిన్స్, షార్క్‌లు, తాబేళ్లు, సముద్రపు పక్షులు కూడా ఉన్నాయి. అన్నింటినీ పరీక్షించిన తర్వాత డాల్ఫిన్స్, కాలిఫోర్నియా సముద్ర సింహాలను ఎంచుకుంది. రష్యా మాదిరిగానే అమెరికా కూడా సముద్రంలోని మైన్స్‌తోపాటు తీర ప్రాంతాల్లో ప్రమాదకర వస్తువులను గుర్తించేందుకు డాల్ఫిన్ దళాలను ఉపయోగించుకుంటోందని రిపోర్ట్ వెల్లడించింది.

Updated Date - 2022-04-29T00:00:18+05:30 IST