Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

TANA: డాలస్‌లో విజయవంతమైన ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా కార్యక్రమం

twitter-iconwatsapp-iconfb-icon
TANA: డాలస్‌లో విజయవంతమైన ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి యోగా కార్యక్రమం

ఎన్నారై డెస్క్: డాలస్‌లో ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా శిక్షణా కార్యక్రమం అద్భుతంగా జరిగింది. తానా డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా, ఆర్ధిక మాంధ్యంలో కొట్టమిట్టాడుతుందన్నారు. ఈ తరుణంలో ప్రవాస భారతీయులు ఒత్తిడిని అధిగమించి  ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడంలో యోగా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తానా బృందం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. యోగా వలన ఆరోగ్యంతో పాటు, మనోధైర్యం, రోగనిరోధక శక్తి వంటి పలుప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. యోగా గురువు చుక్కపల్లి కిరణ్‌ను డాలస్ తీసుకురావడంలో సహాయ సహకారాలు అందించిన సుబ్బరాయ చౌదరి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చుక్కపల్లి కిరణ్‌ను వేదిక మీదకు ఆహ్వానించారు. 


కిరణ్ చుక్కపల్లి.. యోగా అంటే ఎమిటి, ఎలా మనతరం వారికి వచ్చింది అనే విషయాలను చెప్పారు. గత 1400-1500 సంవత్సరాల క్రితం ఎందరో మన భారత దేశంపై దండయాత్ర, పరిపాలన సాగించినా మన ఋషులు, గురువులు ఈ యోగా అర్ట్ ఫాంను సంరక్షించారన్నారు. అదృష్టవశాత్తు గురు పరంపర వలన తనకు హిమాలయాల్లో గురువుల సహకారంతో నేర్చుకునే అవకాశం దక్కిందన్నారు. ఇది తన  పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. యోగా ప్రక్రియ చాలా క్లిష్టమైనది తెలిపారు. గురువు  సమక్షంలో సరియైన పద్దతి లో నేర్చుకుంటే మంచి సత్ఫలితాలు వుంటాయని చెప్పారు. తనను చాలా మంది ‘మీరు ఏరకమైన యోగి హఠ యోగా లేక అష్టాంగ యోగా అని ప్రశ్నించారు’ అని అన్నారు. కానీ దానికి సమాధానం చాలా క్లిష్టమైనదని అన్నారు. నిజానికి హఠ యోగి కావాలంటే అంత సులువు కాదన్నారు. ఈ ఆధునికి చరిత్రలో అలాంటి పట్టు సాధించిన వారు అరుదు అని అన్నారు.


హఠ యోగ చాలా క్లిష్ట మైనదని, దానికి సరళీకృతమైన సంస్కరణ అయిన ‘అష్టాంగ యోగ’ను పతాంజలి మహర్షి మనకు అందించినట్టు చెప్పారు. అన్ని గ్రంథాల సారం స్థిరం, సుఖం, ఆసనం అని.. యోగా ద్వారా ఇది సాధ్యం అవుతుందని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. అనంతరం విన్యాస ఆసనాలను (అధర్ముఖ) , శ్వాస ప్రక్రియ మెళుకువలను సభికులు నేర్పించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ చుక్కపల్లి కిరణ్‌కు గారికి తానాతో మంచి అనుభందం ఉందన్నారు. ఆయన అరకు ప్రాంతంలోని గిరిజన ప్రజలకు చేస్తున్న సేవ చాలా గొప్పది అని చెప్పారు. తానాతో యోగా కార్యక్రమం చేపట్టినందుకు చుక్కపల్లి కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా కార్యవర్గ బృందం కిరణ్ చుక్కపల్లి‌‌‌ని ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో కిరణ్ చుక్కపల్లి.. తానా వారికి ధన్యావాదాలు తెలియజేసి, ప్రత్యేకంగా తాను అమెరికా రావడానికి రాజేష్ అడుసుమిల్లి సహకారం అందిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. థింక్ పేచె సంస్థతో కలిసి పని చేస్తున్న కొప్పెల్ హైస్కూల్ విద్యార్ధులను సభకు పరిచెయం చేసి వారిని అభినందించారు.


TANA: డాలస్‌లో విజయవంతమైన ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి యోగా కార్యక్రమం

డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, కమ్మ్యూనిటీ ఎట్ లార్జ్ సభ్యులు లోకేష్ నాయుడు,ఫౌండేషన్ కోశాధికారి కాంత్ పోలవరపు, కోశాధికారి అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, వెంకట్ బొమ్మ, దిలీప్, లక్ష్మి పాలేటి, దీప్తి సూర్యదేవర, రాజేష్ చుక్కపల్లి మరియు తానా డాలాస్ టీం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నుంచి డాలస్ రావడం ఆనందదాయకం అన్నారు. వారికి పుష్పగుచ్చం, దుశ్శాలువతో సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు..  ఇలా డాలస్ టీం అందరితో కలసి ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. తానా టీంలోని సభ్యులు అందరు కలసి ‘One Team’ లా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు.


తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యవర్గ బృందం శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసుమిల్లి, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, వెంకట్ బొమ్మ, దిలీప్, సుధీర్ చింతమనేని, లక్ష్మి పాలేటి, దీప్తి సూర్యదేవర, రాజేష్ చుక్కపల్లి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా డాలాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.