పెరుగు కోసం Train ఆపేసిన లోకోపైలట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-10T14:54:01+05:30 IST

అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. సాధారణంగా రైళ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపరు. కానీ ఓ ట్రైన్ డ్రైవర్ (లోకోపైలట్).. అతడి అసిస్టెంట్ మాత్రం సిల్లీ కారణంతో వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. అదీకాక వారి ప్రాణాలను ప్రమాదం

పెరుగు కోసం Train ఆపేసిన లోకోపైలట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. సాధారణంగా రైళ్లను ఎక్కడ పడితే అక్కడ ఆపరు. కానీ ఓ ట్రైన్ డ్రైవర్ (లోకోపైలట్).. అతడి అసిస్టెంట్ మాత్రం సిల్లీ కారణంతో వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. అదీకాక వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో విషయం కాస్తా రైల్వే మంత్రి వరకూ వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగింది.. అనే వివరాల్లోకి వెళితే..



లాహోర్-కరాచీ మధ్య నిత్యం పదుల సంఖ్యలో ఇంటర్ సిటీ ట్రైన్‌లు రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం రోజు కూడా లాహోర్ నుంచి కరాచీ వైపు వేలాది మంది ప్రయాణికులతో ఇంటర్ సిటీ ట్రైన్ బయల్దేరింది. సరిగ్గా కన్హా రైల్వే స్టేషన్‌కు సమీపానికి చేరుకోగానే ఆ ట్రైన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో తొలుత ప్రయాణికులు కంగారు పడ్డారు. ట్రైన్‌లో ఏదైన సమస్య తలెత్తిందేమో అని అనుకున్నారు. కానీ లోకో పైలట్, అతడి అసిస్టెంట్ ట్రైన్‌లో నుంచి దిగి.. చేసిన పనికి షాకయ్యారు. కేవలం పెరుగు కోసం ట్రైన్‌ను ఆపేశారని గ్రహించి.. విస్తుపోయారు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు ఆ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో విషయం పాక్ రైల్వే మంత్రి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో రైల్వే మినిస్టర్ స్పందిస్తూ.. లోకో పైలట్, అతడి అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులను ఎప్పటికీ తాను ప్రోత్సహించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ లోకో పైలట్, అతడి అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 






Updated Date - 2021-12-10T14:54:01+05:30 IST