హిందూపురం-యశ్వంతపుర మధ్య ప్రత్యేక డెము రైలు

ABN , First Publish Date - 2020-12-04T06:11:46+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్థం హిందూపురం-యశ్వంతపుర మధ్య పది రోజుల పాటు డీజిల్‌, ట్రాక్షన్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (డెము) ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. హిందూపురం-యశ్వంతపుర ప్రత్యేక డెము రైలు (నెం. 06563) ఈనెల 7 నుంచి 17 వరకు ఆదివారం మినహా పది రోజులపాటు నడపనున్నట్లు తెలిపారు.

హిందూపురం-యశ్వంతపుర మధ్య ప్రత్యేక డెము రైలు

గుంతకల్లు, డిసెంబరు 3: ప్రయాణికుల సౌకర్యార్థం హిందూపురం-యశ్వంతపుర మధ్య పది రోజుల పాటు డీజిల్‌, ట్రాక్షన్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (డెము) ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. హిందూపురం-యశ్వంతపుర ప్రత్యేక డెము రైలు (నెం. 06563) ఈనెల 7 నుంచి 17 వరకు ఆదివారం మినహా పది రోజులపాటు నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు హిందూపురంలో ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.25 గంటలకు యశ్వంతపురకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు యశ్వంతపురలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు హిందూపురం చేరుతుందన్నారు. ఈ రైలు దేవరపల్లి, గౌరిబిదనూరు, తొండేబావి, మక్లిదుర్గ, ఒడ్డరహళ్లి, దొడ్డబళ్లాపూర్‌, రాజాన్‌కుంటి, యలహంక, లొట్టేగొళ్లహళ్లి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-04T06:11:46+05:30 IST