పాత వేళల్లోనే నిజాముద్దీన్‌, ఎల్‌టీటీ ప్రత్యేక రైళ్ల రాకపోకలు

ABN , First Publish Date - 2020-12-05T05:22:32+05:30 IST

విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ (02887/02888), విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌-విశాఖ (02857/02858) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పాత సమయాలలోనే రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు

పాత వేళల్లోనే నిజాముద్దీన్‌, ఎల్‌టీటీ ప్రత్యేక రైళ్ల రాకపోకలు

విశాఖపట్నం, డిసెంబరు 4: విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ (02887/02888), విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌-విశాఖ (02857/02858) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పాత సమయాలలోనే రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వలన నూతన కాలపట్టికలో ప్రకటించిన వేళలు అమల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 02887 నంబరు గల విశాఖ-నిజాముద్దీన్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి మంగళ, బుధ, గురు, శని, ఆది వారాల్లో ఉదయం 6:25 గంటలకు విశాఖలో బయలుదేరి, మర్నాడు సాయంత్రం 4:45 గంటలకు నిజాముద్దీన్‌ చేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 02888 నంబరు గల నిజాముద్దీన్‌-విశాఖ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి గురు, శుక్ర, శని, సోమ, మంగళవారాల్లో ఉదయం 8:35 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి మర్నాడు సాయంత్రం 6:10 గంటలకు విశాఖ చేరుతుంది. 

రాయగడ మీదుగా నడిచే 02857 నంబరు గల విశాఖ-లోకమాన్యతిలక్‌ టెర్మినస్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1:35 గంటలకు లోకమాన్య తిలక్‌ చేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 02858 నంబరు గల లోకమాన్యతిలక్‌ టెర్మినస్‌-విశాఖ ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం ఉదయం 00:15 (సోమవారం అర్ధరాత్రి 12:15) గంటలకు లోకమాన్యతిలక్‌లో బయలుదేరి మర్నాడు (బుధవారం) ఉదయం 5:20 గంటలకు విశాఖ చేరుతుంది. 


Updated Date - 2020-12-05T05:22:32+05:30 IST