వివాహ దినోత్సవం రోజున విషాదం

ABN , First Publish Date - 2021-04-17T07:05:20+05:30 IST

వివాహ దినోత్సవం రోజున శివ మృతదేహాన్ని చూసిన ఆయన భార్యను, తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావడం లేదు.

వివాహ దినోత్సవం రోజున విషాదం
భార్య, కుమారుడితో శివ (ఫైల్‌ఫొటో)

చంద్రగిరి, ఏప్రిల్‌ 16: చంద్రగిరి మండలంలోని మఠంపల్లెకు చెందిన మునిరాజ, లక్ష్మీకాంతమ్మ కుమారుడు శివ తమ గ్రామానికే చెందిన పవిత్రను ప్రేమించాడు. ఆపై పెద్దలను ఒప్పించి గత ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల కిందటే ఓ కుమారుడు కూడా జన్మించాడు. శివ తిరుపతిలోని అను ఫ్లెక్సీలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి 10గంటల సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అయ్యాక శివ మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. సరిగ్గా వివాహ దినోత్సవం రోజున శివ మృతదేహాన్ని చూసిన ఆయన భార్యను, తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావడం లేదు. విషయం తెలియడంతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-04-17T07:05:20+05:30 IST