అంబులెన్స్‌ పైలట్‌ మృతితో ఓలలో విషాదఛాయలు

ABN , First Publish Date - 2021-01-21T06:29:50+05:30 IST

మండలంలోని ఓల గ్రామానికి చెందిన అంబులెన్సు పైలట్‌ విఠల్‌రావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విఠల్‌రావు మృతి చెందడంతో ఓల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అంబులెన్స్‌ పైలట్‌ మృతితో ఓలలో విషాదఛాయలు
ఓల గ్రామంలో రోదిస్తున్న విఠల్‌రావు కుటుంబ సభ్యులు

కుంటాల, జనవరి 20 : మండలంలోని ఓల గ్రామానికి చెందిన అంబులెన్సు పైలట్‌ విఠల్‌రావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విఠల్‌రావు మృతి చెందడంతో ఓల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబసభ్యుల రోదన లు మిన్నంటాయి. విఠల్‌రావు గత 13 సంవత్సరాలుగా 108 అంబు లెన్సు పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత 45 రోజుల క్రితం అతను సారంగపూర్‌ మండలం అడెల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తుం డగా కనకట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతని బోటనివేలుకి తీవ్ర గాయాలవ్వడంతో వైద్యులు ఇటీవల అతని బోటనవేలు తొలగించారు. అయితే వైద్య సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సి నేషన్‌లో భాగంగా ఆయన మంగళవారం మండల కేంద్రంలో టీకా వేయించుకున్నారు. పర్యవేక్షణ అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి వెళ్లిన అతనికి, తెల్లవారు జామున గుండెపోటు రావడంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తుందగా నర్సాపూర్‌ వద్ద మృతి చెందాడు. విఠల్‌రావుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నాడు. 

Updated Date - 2021-01-21T06:29:50+05:30 IST