ఆ బుల్లెట్టు బండికి ఫైన్ వేశారు.. దీంతో బండి owner ఏం చేశారో తెలుసా..

ABN , First Publish Date - 2021-09-29T23:06:00+05:30 IST

బైకు రేసులంటే.. యువతకు ప్యాషన్ అయింది. ధర ఎంతైనా లెక్కచేయకుండా బైకులను కొనుగోలు చేస్తూ వాటిని తమకు ఇష్టం వచ్చిన విధంగా రీమోడలింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అందరిలో దర్పం చూపించాలనే ఉద్దేశంతో కొందరు ఎక్కువగా బుల్లెట్

ఆ బుల్లెట్టు బండికి ఫైన్ వేశారు.. దీంతో బండి owner ఏం చేశారో తెలుసా..

బైకు రేసులన్నా, విభిన్న పద్ధతుల్లో బైక్ రైడింగ్ అన్నా.. యువతకు ప్యాషన్ అయింది. ధర ఎంతైనా లెక్కచేయకుండా బైకులను కొనుగోలు చేస్తూ వాటిని తమకు ఇష్టం వచ్చిన విధంగా రీమోడలింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అందరిలో దర్పం చూపించాలనే ఉద్దేశంతో కొందరు ఎక్కువగా బుల్లెట్ బండిని కొంటుంటారు. రకరకాలుగా ఫోజులు ఇస్తూ బైక్ రైడింగ్ చేస్తుంటారు. అందరి దృష్టి తమ వైపే ఉండాలని.. కొందరు ఇంకో అడుగు ముందుకేసి బైకు సైలెన్సర్ తీసేసి విపరీతమైన సౌండ్ చేస్తూ వెళ్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు చాలా మందికి కోపం వస్తూ ఉంటుంది. ఇలాగే లక్నోలో ఓ సంఘటన జరిగింది. ఓ యువకుడు బుల్లెట్టు బండిని కొనుగోలు చేశాడు. అంతటితో ఆగకుండా వెరైటీగా ఉండాలనే ఉద్దేశంతో దాని సైలెన్సర్ నుంచి ఎక్కువ సౌండ్ వచ్చేలా ఏర్పాట్లు చేయించుకున్నాడు. 



ఉత్తరప్రదేశ్‌లో  రోహిత్‌ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్‌ వాహనంపై బయలుదేరాడు. రోడ్లపై సౌండ్ ఎక్కువ చేస్తూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో యూపీ ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం గంగానగర్‌-మవాన్‌రోడ్‌లో సాకేత్‌ క్రాసింగ్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. యువకుడిని గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు అతడిని నిలిపేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుందనే కారణంతో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ కుమార్‌ మిశ్రా రూ.16 వేల చలాన్‌ వేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.


కొద్దిసేపు వాగ్వాదం తర్వాత రోహిత్‌ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఆ సమయంలో ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో మళ్లీ బుధవారం తల్లిదండ్రులతో రోహిత్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


దీనిపై రోహిత్ మాట్లాడుతూ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అయితే కమిషనర్‌ కార్యాలయం ఎదుట న్యూసెన్స్‌ చేయడంతో రోహిత్‌, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-09-29T23:06:00+05:30 IST