ట్రా‘ఫికర్‌’

ABN , First Publish Date - 2022-09-29T05:35:17+05:30 IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతుంది. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో ట్రాఫిక్‌తో ప్రజలు మరింత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణంలోని సుభా్‌షరోడ్డు, గాంధీరోడ్డు, కమాన్‌ఏరియాలో వాహనదారులు ప్రయాణం చేసేందుకు జంకుతున్నారు. కాగా కొందరు వాహనదారులు రోడ్డుపై ఇష్టారీతిన వెళ్లడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలను గాలికొదిలేయడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు పెండింగ్‌ చలాన్లపైనే దృష్టి సారిస్తున్నారు.

ట్రా‘ఫికర్‌’
సిద్దిపేటలో పెండింగ్‌ చలాన్‌లను కట్టిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

నిబంధనలను పాటించని వాహనదారులు 

రోడ్డుపైనే అడ్డంగా చిరు వ్యాపారాలు

ఙచలాన్లపైనే ట్రాఫిక్‌ పోలీసుల ఫోకస్‌


సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 28: సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతుంది. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో ట్రాఫిక్‌తో ప్రజలు మరింత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణంలోని సుభా్‌షరోడ్డు, గాంధీరోడ్డు, కమాన్‌ఏరియాలో వాహనదారులు ప్రయాణం చేసేందుకు జంకుతున్నారు. కాగా కొందరు వాహనదారులు రోడ్డుపై ఇష్టారీతిన వెళ్లడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలను గాలికొదిలేయడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు పెండింగ్‌ చలాన్లపైనే దృష్టి సారిస్తున్నారు. 


పండుగ సందర్భాల్లో కానరాని బందోబస్తు

పట్టణంలోని సుభా్‌షరోడ్డులో దుకాణాల ఎదుట పండ్ల వ్యాపారాలు, తోపుడు బండ్లను రోడ్డుకు ఇరువైపులా పెట్టడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారితుంది. అలాగే బతుకమ్మ, దసరా, వివిధ పండుగ సందర్భాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల తాకిడితో సుభాష్‌రోడ్డు మొత్తం రద్దీతో కిక్కిరిసిపోతుంది. ప్రధాన కూడళ్లలో పోలీసుల నిఘా వేస్తున్నా... రద్దీ ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో వినాయక చవితి పండుగ రోజు మార్కెట్‌ ఏరియాలో, రద్దీ గల ప్రాంతాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో 20 నుంచి 30 వరకు సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి పర్యవేక్షణ కరువైంది. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు పనిచేసిన చోట ట్రాఫిక్‌ను పరిశీలించి కట్టడి చర్యలు చేపట్టే ప్రయత్నం కూడా పోలీసులు చేపట్టడం లేదు.


అవగాహన కల్పించని పోలీసులు

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేక విద్యార్థులు, యువకులు రోడ్డుపై ఇష్టారీతిన వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలి. కానీ అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోగా,  కేవలం పెండింగ్‌ చలాన్లపైనే దృష్టి సారిస్తున్నారు. ఏదైనా చిన్నపాటి తప్పిదం కనిపిస్తే చాలు వెంటపడి మరి చలాన్లు విధించే ట్రాఫిక్‌ పోలీసులు పట్టణంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌పై మాత్రం దృష్టి సారించడం లేదు. వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు కంటబడితే చాలు భయంతో పరిగెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Updated Date - 2022-09-29T05:35:17+05:30 IST