వర్షం వస్తే రాకపోకలు బంద్‌

ABN , First Publish Date - 2021-07-24T06:07:40+05:30 IST

వర్షం వస్తే చాలు ఆ గ్రామాలకు రాకపోకలు బంద్‌ చేయాల్సిందేనని మండలంలోని టీ సదుం, అగ్రహారంపల్లి, సున్నం పల్లివాండ్లపల్లి, నందిగానిపల్లి, బేరిపల్లి, బాలసముద్రం, ఎర్రచెరువుపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది.

వర్షం వస్తే రాకపోకలు బంద్‌
రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద నిలిచిన వర్షపునీరు

 రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద నీరు నిల్వ

 పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

తనకల్లు, జూలై 23 : వర్షం వస్తే చాలు ఆ గ్రామాలకు రాకపోకలు బంద్‌ చేయాల్సిందేనని మండలంలోని టీ సదుం, అగ్రహారంపల్లి, సున్నం పల్లివాండ్లపల్లి, నందిగానిపల్లి, బేరిపల్లి, బాలసముద్రం, ఎర్రచెరువుపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది.  మండలంలోని బాలసముద్రం లెవల్‌ క్రాసింగ్‌ నెంబర్‌ 59 వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద రాకపోకలకు వీలుకాని విధంగా వర్షపునీరు నిల్వ ఉంటోంది. ఈ కారణంగా ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.  రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న జంబుచెరువుకు నీళ్ళు వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. జంబుచెరువు కూడా నిండి పోవడంతో , నీళ్ళు వెనక్కు వచ్చి రైల్వే బ్రిడ్జి వద్ద నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను రైల్వే అ ధికారుల దృష్టికి తీసుకెళ్ళితే నీళ్ళు తోడి తాత్కాలికంగా సమస్యను ప రిష్కరిస్తున్నారు తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదని సున్నం పల్లివాండ్లపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి, టీ సదుంకు చెందిన మస్తాన్‌, బాల సముద్రంకు చెందిన వెంకటరమణ తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, నీటిని మళ్ళించే కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళ న కార్యక్రమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. 


Updated Date - 2021-07-24T06:07:40+05:30 IST